కధానాయకుడు రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం “స్కంద”. ఈ
చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి
నిర్మాత. ఈ సినిమా వచ్చే నెల 15న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో
ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా ఈ నెల 26న ప్రీరిలీజ్
థండర్ పేరుతో ఓ ప్రచార చిత్రం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం
అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను నెట్టింట పంచుకున్నారు.
అందులో రామ్ పంచెకట్టుతో శ్రీలీల లంగా ఓణీలో పొలాల మధ్య కూర్చొని చిరునవ్వులు
చిందిస్తూ కనిపించారు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో రామ్ రెండు
కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్.