‘పరిశ్రమకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న. ఈ పదేళ్లలో నా జీవితంలో చాలా
మార్పులు జరిగాయి అంతకుముందు సినిమాల కోసం నిద్ర మానుకొని మరీ ఏకధాటిగా
షూటింగ్ చేసిన రోజులున్నాయి. కెరీర్ కోసమే పూర్తి సమయం కేటాయించా. ప్రస్తుతం
నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది నాకో కూతురు వచ్చింది నా భర్త ఉన్నాడు.
అంతకుముందు పదేళ్లలో నా తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులతో పెద్దగా సమయం
వెచ్చించలేకపోయా. ఇప్పుడు ఆ బాధ్యత పూర్తి చేయాలి’ అంటోంది అలియా భట్.
వెండితెరకి వచ్చి పదేళ్లైన సందర్భంగా అలియా ఆదివారం మీడియాతో ప్రత్యేకంగా
మాట్లాడింది. ఇలా చెప్పినంత మాత్రాన సినిమాల్ని పూర్తిగా వదిలేస్తానని కాదు.
సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సమన్వయం పాటిస్తూ.. వెళ్లాలనుకుంటున్నా. నా
కోసం కూడా కొంచెం సమయం కేటాయించుకోవాలి. నాతో ఒక శ్రేయోభిలాషి చెప్పినట్టు మనం
ఎంత ప్రయత్నించినా నూటికి నూరు శాతం గొప్ప తల్లి, గొప్ప నటి, గొప్ప కుమార్తె,
గొప్ప ప్రొఫెషనల్ కాలేం. మన చేయాల్సిందల్లా నిజాయతీగా, బాధ్యతగా వ్యవహరించడమే.
నేనలాగే చేయాలనుకుంటున్నా అని చెప్పింది.