అందాలతార కాజల్ అగర్వాల్ అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మగ బిడ్డకు జన్మనిచ్చి ఆరు నెలలు కావొస్త్తుంది. తన బిడ్డకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తన కుమారుడు నీల్ 6 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇన్‌స్టాలో ఓ లేఖ రాశారు. ‘‘నీల్.. నువ్వు పుట్టి అప్పుడే 6 నెలలు అవుతోంది. కాలం ఎంత వేగంగా గడిచిపోతోంది. నీ వల్ల నా జీవితంలో చూసిన మార్పులను నమ్మలేకపోతున్నా. యంగ్ మదర్‌గా అనుక్షణం భయపడే నేను తల్లిగా నా కర్తవ్యాన్ని కరెక్ట్‌గా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను.
గొప్ప తల్లిని ఎలా కావాలో అని ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. నా పనులు చేసుకుంటూనే నీ కోసం నా సమయాన్ని కేటాయిస్తున్నాను. నీపై ప్రేమ, శ్రద్థ చూపడంలో ఎక్కడా తగ్గను. ఇది నాకు ఛాలెంజింగ్ అయినా ఇందులో నేను పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు. ఆ ఆనందం ముందు సవాల్ చిన్నదే. రాత్రిపూట నా గుండెలపై నువ్వు చేసే అల్లరి నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేలపై తిరుగుతున్నావు. ఎడమ నుంచి కుడికి రోల్ కావడం, పొట్టను ముందుకు వెనక్కు ఊపడం ఇలాంటి క్షణాలను ఆస్వాదిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మేం గుర్తుపెట్టుకుంటాను. మై లవ్.. మై నీల్’’ అని కాజల్ తన బిడ్డ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను గంటల్లోనే 7లక్షలకు పైగా లైక్ చేశారు. సందీప్ కిషన్, హన్సిక, నేహాదూపియా, రాశీఖన్నా కామెంట్లు చేశారు.