సంచనాలు సృష్టిస్తూ దూసుకెళుతున్న సినిమా ‘కాంతార’. కన్నడ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రికార్డులను ఈ మూవీ కొల్లగొడుతోంది. ఇటీవలే ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్స్ అత్యధిక రేటింగ్ సాధించి.. టాప్ 250 భారతీయ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా మరో రికార్డుని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ కన్నడ నుంచి వచ్చిన మూవీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. అందులో.. రూ. 1207 కోట్ల కలెక్షన్లతో ‘కేజీఎఫ్ 2’ అగ్రస్థానంలో ఉండగా.. రూ.250 కోట్లతో ‘కేజీఎఫ్ 1’ , రూ.158 కోట్లతో ‘విక్రాంత్ రోణ’ , రూ.151 కోట్లతో ‘జేమ్స్’ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
తాజాగా ఈ జాబితాలో కాంతార మూవీ చేరింది. అది కూడా ‘విక్రాంత్ రోణ’, ‘జేమ్స్’ని వెనక్కి నెట్టి దాదాపు రూ. 170 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. స్టార్స్ సినిమాలని వెనక్కి నెట్టి ఓ సాధారణ సినిమా ఈ స్థాయిలో ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కుని సాధించడం ‘కాంతార’కి చాలా సులువని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్నాటకలో తప్ప ఇతర రాష్ట్రాల్లో అంతగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ..
ప్రేక్షకులని ఇంతలా ఆకట్టుకోవడం విశేషం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి ప్రాణమైన దైవిక ఆత్మ, శక్తి ఈ సినిమాని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. అలాగే తమ స్నేహితులకు సినిమాను ప్రమోట్ చేసిన కర్ణాటక ప్రజలు, కాంతారా సక్సెస్‌కి ప్రధాన కారణం అని భావిస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు.