ఢీ’ డాన్స్ షోతో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ చావా చైతన్య (31) శనివారం
రాత్రి నెల్లూరులో ఆత్మహత్య చేసుకొన్నారు. ఐదేళ్లుగా చైతన్య ఢీ షోలో డ్యాన్స్
మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్థానిక కళాంజలి
సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ప్రపంచ నృత్య దినోత్సవంలో పాల్గొని నృత్య
అవార్డు అందుకొన్నారు.
తర్వాత నెల్లూరు క్లబ్ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ
క్రమంలో శనివారం రాత్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ సెల్ఫీ
వీడియోను తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం
వచ్చిన హోటల్ సిబ్బంది దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు
హాటల్‌కు చేరుకొని గది కిటికీలో నుంచి చూడగా చైతన్య ఫ్యానుకు వేలాడుతూ
కన్పించారు.
తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే చైతన్య మృతి చెందారు.
దనలక్ష్మిపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రి ఫిర్యాదు మేరకు
దర్గామిట్ట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకు
తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు