చంద్రబాబునాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్న తమిళ సూపర్ స్టార్
రజనీకాంత్‌పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శల దాడి జరుగుతోంది . పేరుకే
NTR శతజయంతి అయినా చంద్రబాబు తన రాజకీయ ప్రాపకం కోసం ప్రాకులాడినట్లు విమర్శలు
వెల్లు వెత్తాయి. NTR కుటుంబ సభ్యులను పిలిచినట్లు చెప్పకొన్నా సభలో జూనియర్
NTR గురించి ప్రస్థావన రాలేదు.
శతజయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ పాల్గొని అటు వెళ్లగానే ఆయనపై వైసీపీ
నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ
ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన
తమిళనాడులో హీరో అయితే, ఇక్కడేం గొప్ప అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క
రాష్ట్రం వారితో నీతులు చెప్పించుకునే స్థితిలో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు
మరో వైపు అభిమానులు మాత్రం రజనీకాంత్‌కు వారందరూ వెంటనే క్షమాపణలు
చెప్పాలంటూ ట్విట్టర్ వేదికంగా డిమాండ్ చేస్తున్నారు. #YSRCPApologizeRajini
హ్యాష్‌ట్యాగ్‌తో వైసీపీ నేతలపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మీమ్స్
పోస్టు చేస్తూ ట్విట్టర్‌ను హోరెత్తించారు. దీంతో కొన్ని క్షణాల్లోనే ఈ
హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని,
ఎన్టీఆర్, చంద్రబాబుతో తనుకున్న అనుబంధాన్ని మాత్రమే పంచుకున్నారని గుర్తు
చేస్తున్నారు. వారి స్నేహం ఈనాటిది కాదంటూ అప్పటి ఫొటోలను పోస్టు చేస్తున్నారు.