సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమ
కావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుణ శేఖర్
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే భారీ అంచనాల నడుమ
విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
భారీ హైప్ ఉన్నప్పటికీ ఈ సినిమా కేవలం కొందరినీ మాత్రమే ఆకట్టుకుందనే వాదనలు
వినిపించాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ దీనిపై స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా నటి సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్
నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భగవద్గీతలోని శ్లోకాన్ని పోస్ట్ చేసింది
సామ్. దీంతో సామ్ చేసిన ఈ పోస్ట్ శాకుంతలం రిజల్ట్ గురించేనా అనే చర్చ
మొదలైంది.
ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటంటే.. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు
కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’ అనే శ్లోకాన్ని పోస్ట్
చేసింది. ఈ శ్లోకం అర్థం.. ‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి
అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు’.