కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను
తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్
నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, అల్లు అర్హ, సచిన్ ఖేడ్కర్,
అనన్య నాగళ్ల, కబీర్ బేడీ, వర్షిణీ, హరీశ్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో
నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న
థియేటర్లలోకి రానుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టింది సామ్. ఇందులో
శాకుంతలం మూవీకి సంబంధించి ఐదు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘పూలు అంటే నాకు
ఎలర్జీ. అయితే ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూలు చుట్టుకోవడంతో దద్దుర్లు
వచ్చాయి. అవీ ట్యాటూలాగా కనిపించాయని.. ఆరు నెలలు అవి అలాగే ఉండిపోయాయి. అయితే
షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్ చేశాను’ అని చెప్పుకొచ్చింది
సామ్.
శకుంతలంలో తన పాత్రకు సమంత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా
డబ్బింగ్ చెప్పుకుందట. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్
కలలోకి వచ్చేవని తెలిపింది. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో కుందేలు
కరిచిందట. సెట్లో చాలా కుందేళ్లు ఉండగా.. ఒకటి మాత్రం తనని కరిచిందని .. ఆ
కుందేలు తనకు నచ్చలేదని.. అసలు అది క్యూట్‌గానే లేదని పేర్కొంది సామ్
(నవ్వుతూ). ఇక శాకుంతలం సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని.. అది ఒరిజినల్
కాదని సమంత అసలు విషయం తెలిపింది.
శాకుంతం మూవీలోని ఓ పాటకు ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని సమంత
తెలిపింది. దీంతోతో చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. రౌండ్ తిరిగినప్పుడు ఆ
లెహెంగా బరువుకు ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా
అరిచారని వెల్లడించింది. ‘నేను వెళ్లడం లేదు.. లెహంగానే నన్ను లాక్కుని
వెళ్తోంది’ అని చెప్పడంతో సెట్లోని వారంతా నవ్వారని సినిమా షూటింగ్
అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది.