నిజంగానే జుట్టును పెంచుకుంటారు. పాత్రకు తగ్గట్టు కావాల్సినట్టుగా
మల్చుకుంటారు. అయితే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కోసం విగ్గు వాడాడట. ఈ
విషయాన్ని స్టేజ్ మీదే చెప్పాడు. అందరికీ ఆ విగ్గుని కూడా చూపించాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పనికి నెట్టింట్లో అంతా షాక్ అవుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కరోనా
సమయంలో రెండేళ్లు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత బైక్
యాక్సిడెంట్ తరువాత హాస్పిటల్ బెడ్డుకు, ఇంటికే పరిమితమయ్యాడు. రిపబ్లిక్
సినిమా అయితే సాయి ధరమ్ తేజ్ బెడ్డు మీద ఉండగానే రిలీజ్ అయింది.
ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు
రాబోతోన్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ఇప్పుడు దర్శకుడిగా పరిచయం
కాబోతోన్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. విరూపాక్ష
టీజర్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.
సాయి ధరమ్ తేజ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. సాయి ధరమ్ తేజ్ లుక్,
హెయిర్ స్టైల్ మీద అందరూ కామెంట్ చేశారు. అది విగ్ అని అన్నారు. అయితే దానిపై
ట్రోలింగ్ కూడా జరిగింది. విగ్గా? కాదా? అన్నది చిత్రయూనిట్ క్లారిటీ
ఇచ్చేసింది.
విరూపాక్ష సినిమాలోని పాత్రల పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ
ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ తన సాధారణ లుక్కుతో వచ్చాడు. అయితే సినిమా కోసం విగ్
వాడానని, స్టేజ్ మీద అందరికీ చూపించాడు. ఇప్పుడు ఇది పెట్టుకోలేదు అని
అన్నాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్‌ది ఈ సినిమాలో విగ్ అనేది అందరికీ
తెలిసిపోయింది.