వరసగా హాలీవుడ్ టెక్నీషియన్స్ జాయిన్ అవ్వడం వెనక అసలు కారణం అదేనా..? పాన్
ఇండియన్ స్టేజ్ దాటి పాన్ వరల్డ్ దిశగా దీన్ని డిజైన్ చేస్తున్నారా..?
రోజురోజుకీ పెరుగుతున్న క్య్రూ చూస్తుంటే.. కొరటాలపై ప్రెజర్ కూడా డబుల్
అవుతుంది. మరి దీన్ని ఆయనెలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..?
ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆచార్య
ఫ్లాపైనా దాని ప్రభావం మాత్రం ఈ సినిమాపై పడకుండా చూసుకుంటున్నారు కొరటాల.
పైగా తారక్ కూడా ఈ దర్శకుడిని పూర్తిగా నమ్మేసారు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్
షూటింగ్ మొదలవుతుంది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే ఈ చిత్రం వస్తుంది.ముందు
పాన్ ఇండియన్ సినిమా అనుకున్నా.. ఇప్పుడది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది.
హాలీవుడ్ టెక్నీషియన్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఎన్టీఆర్ 30లో జాయిన్ అవుతున్నారు.
ఆ మధ్య మిషన్ ఇంపాజిబుల్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ జాయిన్ అవ్వగా.. ఈ
మధ్యే ఆక్వామెన్ సహా చాలా సీ బ్యాక్ డ్రాప్ సినిమాలకు పని చేసిన విఎఫ్ఎక్స్
సూపర్వైజర్ బ్రాడ్ మిన్నిచ్ జాయిన్ అయ్యారు.
కథ ఎంత బలంగా ఉన్నా.. దాన్ని స్క్రీన్ మీద చూపించడానికి అంతే బలమైన టీం
ఉండాలని నమ్ముతున్నారు కొరటాల. అందుకే క్వాలిటీ విషయంలో తగ్గట్లేదీయన. ఈ
నేపథ్యంలోనే ఇండియాలోనే బెస్ట్ టెక్నీషియన్స్‌తో పాటు.. హాలీవుడ్ నుంచి
తీసుకొస్తున్నారు. ఇదంతా పాన్ వరల్డ్ స్థాయిలో NTR30 విడుదల చేయడానికే అని
అర్థమవుతుంది.