సంగతి తెలిసిందే. అయితే వాటిని ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, ఇతర సభ్యులో
ఖండిస్తుంటారు. మాటలు ఒకలా ఉన్నా.. చేతలు ఇంకోలా ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి.
అల్లు అర్జున్ అయితే మెగా అనే మాటను కూడా తన నోటి నుంచి బయటకు రానివ్వడం లేదు.
ఎంత సేపు అల్లు బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. చిరంజీవి, పవన్
కళ్యాణ్ వంటి పేర్లు పలకడం ఎప్పుడో మానేసినట్టుగా కనిపిస్తుంది.
ఇక బన్నీ సౌతం మెగా కాంపౌండ్, మెగా హీరో అనే ట్యాగ్ నుంచి దూరంగా ఉండేందుకు
ప్రయత్నించాడని, ఇప్పుడు పూర్తిగా మెగా నీడ నుంచి వెళ్లిపోయినట్టుగా అర్థం
అవుతోంది. రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో బన్నీ ఎక్కడా కనిపించలేదు.
విదేశాల్లో ఉండి రాలేదని అనుకుంటే.. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించలేదు.
ట్విట్టర్లో ట్వీట్ గానీ, ఇన్ స్టా, ఫేస్ బుక్‌లో పోస్ట్ గానీ, కనీసం అందులో
స్టోరీ గానీ పెట్టలేదు. రామ్ చరణ్‌కు పుట్టిన రోజు విషెస్ చెప్పనేలేదు.
అల్లు అర్జున్ కావాలనే ఇలా విషెస్ చెప్పలేదని ఓ వర్గం ఆయన మీద సీరియస్
అవుతోంది. ఇక ప్రభాస్ సైతం రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదు. ప్రభాస్ తన సినిమా
షూటింగ్‌లతో బిజీగా ఉండి చెప్పలేదేమో అని ఇంకొంత మంది అంటున్నారు. బన్నీ,
ప్రభాస్ ఇలా అందరూ కూడా రామ్ చరణ్‌కు పర్సనల్‌గా మెసెజ్ పంపించి ఉంటారని,
ప్రతీ సారి ఇలా సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని చెప్పుకోవాల్సిన పని లేదని
ఇంకొంత మంది అంటున్నారు.
బన్నీ నిన్న అంతా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. కానీ ఇప్పుడు ఓ ట్వీట్ వేశాడు.
నటుడిగా ఇరవై ఏళ్లు అయిందని, దీనికి కారణమైన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని,
ఇదంతా కూడా అభిమానులు, సినీ ప్రేక్షకుల వల్లే సాధ్యమైందని అన్నాడు. ఇలా
ఇప్పుడు ట్వీట్ వేసిన వాడు.. నిన్న ఓ ట్వీటేసి రామ్ చరణ్‌కు విషెస్ చెప్పొచ్చు
కదా? అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మొన్న ఆస్కార్ వచ్చినప్పుడు కూడా మై
బ్రదర్ అని చరణ్‌ను, తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్ అని సంబోధించడంతో పెద్ద
వివాదానికే దారి తీసిన సంగతి తెలిసిందే.