లండన్లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ రైల్వే స్టేషన్ సమీపంలో
కుప్పకూలిన ఆయన్ను.. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.
మార్చి 16న రైల్వే స్టేషన్ బయట పాల్ గ్రాంట్ ఉన్నట్టుండి పడిపోయారు. ఆయన్ను
ఆసుపత్రికి తరలించగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పారు. మార్చి 19
దాకా చికిత్స అందించారు. బతికే అవకాశాలు లేవన్న కారణంతో ‘లైఫ్ సపోర్ట్
మిషన్’ను తొలగించాలని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాల్ గ్రాంట్
మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణమేంటన్నది
మాత్రం వెల్లడించలేదు.
4 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్న పాల్ గ్రాంట్.. విల్లో, లబిరింత్, ది డెడ్,
లెజెండ్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హ్యారీ పోటర్, స్టార్
వార్స్ చిత్రాలతో పాప్యులర్ అయ్యారు.
మరియా డ్వేర్ తో కలిసి జీవిస్తున్న ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు
ఉన్నారు. స్పాండిలోపిఫినల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే జెనెటిక్ డిజార్డర్
కారణంతో మరుగుజ్జులా ఉండిపోయారు. ఈ కారణంగా ఆయనకు పలు అనారోగ్య సమస్యలు
వచ్చేవి.