హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో
రానా.. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా
ఉన్నారు.ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్రలో నటించారు. ఈ వెబ్
సిరీస్ మార్చి 10వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ టీవీ
సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా
తెరకెక్కించారు.ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా
ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంత ఆరోగ్యం
గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్
ప్రశ్నిస్తూ తమ వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు
ప్రజల గొంతుకగా మారగలరా అని ప్రశ్నించాడు. రానా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తమ
స్వంత అభిప్రాయం ఉంటుందని, ప్రతి ఒక్కరూ దాని గురించి ఎలా మాట్లాడతారు.
మిగతవారు మాట్లాడేప్పుడు ఎలా ఉంటుందనేది ముఖ్యం అన్నారు. అయితే సమంత ఆరోగ్య
పరిస్థితి గురించి తెలియగానే ఆమెను పరామర్శించాను.మేము ఎప్పుడూ
మాట్లాడుకుంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితమూ సాఫీగా
ఉండదని అన్నారు.