బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాస్
హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రను
పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో
జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై
పక్కటెముక కాస్త విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్
స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. తాను గాయపడటంతో షూటింగ్ క్యాన్సిల్
అయిందని చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని ఏఐజీ
ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్ ముంబయికి వెళ్లారు. ప్రస్తుతం
ముంబయిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు
విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు అమితాబ్ తెలిపారు.
అమితాబ్ స్వయంగా తన బ్లాగ్లో వివరాలను తెలిపారు. ”హైదరాబాద్లో
‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్లో ఒక యాక్షన్ షాట్ సమయంలో ప్రమాదం జరిగింది.
వెంటనే ఎఐజి హాస్పిటల్లో డాక్టర్లను సంప్రదించగా.. నాకు సిటి స్కాన్ చేశారు.
మిగతావారికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇంట్లో ఉండి
విశ్రాంతి తీసుకుంటున్నాను. నా గాయం కాస్త నొప్పిగానే ఉంది.. కదలడం, ఊపిరి
తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది.
నొప్పికి కొన్ని మందులు వాడుతున్నాను. గాయం కారణంగా చేయాల్సిన పనులన్నీ
ఆగిపోయాయి. చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేయకూడదు. ముఖ్యమైన పనులను
ఫోన్ ద్వారా అటెండ్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం అభిమానులను కలవలేను.
అందుకే ఎవరూ రావద్దు. ” అని వెల్లడించారు.