ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ఘోరం జరిగింది.
కరెంట్ షాక్ తగిలి ఓ టెక్నీషియన్ చనిపోయాడు. తమిళ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి
వార్తలు వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కు తృటిలో ప్రమాదం
తప్పినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నైలోని పంచతాన్
రికార్డింగ్ స్టూడియోలో రెహమాన్ ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబోతున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్టూడియోలో లైట్లు
సరి చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కరెంట్ షాక్ తో లైట్ మన్ చనిపోయాడు.
లైట్లు మార్చుతుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడిపోయాడు. కరెంట్ షాక్ తీవ్రత
ఎక్కువగా ఉండటంతో తను అక్కడిక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి
సంబంధించిన చాలా తమిళ వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, అధికారికంగా ఈ
ప్రమాదానికి సంబంధించి రెహమాన్ తరఫు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పంచతాన్
స్టూడియో నుంచి రెహమాన్ లైవ్ షో లు, కన్ సర్ట్ లు చేస్తుంటారు. చెన్నైలోని
తన ఇంటిలోనే ఈ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు.
మ్యూజిక్ కంపోజర్, ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్ తన ఇన్స్టాగ్రామ్
ఖాతాలోకి తీసుకున్నాడు. అతను ప్రదర్శన ఇస్తున్న సెట్లో షాన్డిలియర్లు, ఇతర
సామాగ్రి కూలిపోయాయని వెల్లడించాడు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత తాను
స్వల్పంగా గాయపడినట్టు అమీన్ చెప్పాడు.