బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ భార్య, డిజైనర్ గౌరి ఖాన్‌పై ప్రాథమిక సమాచార
నివేదిక(ఎఫ్ఐఆర్) నమోదయింది. ఇండియన్ పీ నల్ కోడ్(ఐపిసి) 409 సెక్షన్ కింద
ఆమెపై కేసు నమోదు అయింది. ముంబై వాసి అయిన జశ్వంత్ షా ఫిర్యాదు ఆధారంగా కేసు
నమోదు చేశారు. గౌరి అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ రూ. 86 లక్షలు తీసుకుని కూడా
తనకు ఫ్లాట్ అప్పగించలేదని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫ్లాట్
లక్నోకు చెందిన సుశాంత్ గోల్ఫ్ సిటీ ఏరియాలో తుల్సియానీ గోల్ఫ్ వద్ద ఉందని
ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. ఆ ఫ్లాట్‌ను తనకు కాకుండా వేరొకరికి ఇచ్చారని
ఆరోపించారు. గౌరి ఖాన్పైనే కాకుండా తుల్సియాన్ కన్స్ట్రక్షన్ అండ్
డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైర్టెర్ అనిల్ కుమార్ తుల్సియానీ,
డైరెక్టర్ మహేశ్ తుల్సియానీపై కూడా ఈ ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదు దారుడు తన
ఫిర్యాదులో గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం వల్లే తాను ప్రభావితుడినై ఆ
ఫ్లాట్ కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.