దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్. చిత్రం భారీ
విజయాన్ని అందుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను గర్వపడేలా చేస్తోంది. ఈ
సినిమా టీమ్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా గౌరవాన్ని పెంచింది. ఈ
సినిమాకు అన్ని వైపుల నుంచి ముఖ్యంగా అంతర్జాతీయ సినీ వర్గాల నుంచి ప్రశంసలు
లభించాయి. దాంతో మన ఇండియన్ సినిమా రేంజ్ మరో లెవల్ కు చేరుకుంది. శుక్రవారం
రాత్రి జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ చిత్రం
ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకుంది! అందులో భాగంగా RRR ఉత్తమ యాక్షన్
చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్, ఉత్తమ ఒరిజినల్ పాట, ఉత్తమ స్టంట్ ట్రోఫీలను
గెలుచుకుంది. చిత్ర బృందం టామ్ క్రూజ్ టాప్ గన్: మావెరిక్ను ఓడించగలిగింది.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును స్వీకరిస్తూ, రాజమౌళి వేదికపై
మాట్లాడారు. ” బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్…ఇండియాలోని నా తోటి
చిత్రనిర్మాతలందరికీ, మనం నిజంగా అంతర్జాతీయ చిత్రాలను తీయగలమని విశ్వసించాలని
మనందరికీ ఉంది. ధన్యవాదాలు. జై హింద్.” అని ప్రసంగించారు.