జీ -5 సిరీస్ లో వస్తున్న తాజ్ – డివైడెడ్ బై బ్లడ్ లో ప్రముఖ నటుడు
నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్ గా నటిస్తున్నారు. ఈ షో మొఘల్ సామ్రాజ్యంలోని
అంతర్గత పనితీరు, వారసత్వ నాటకాల గురించి వెల్లడి చేసే కథ”గా రూపొందుతోంది. ఈ
సందర్బంగా మొఘల్స్, నేటి పాలకులు, చరిత్ర, వర్తమాన వ్యవహారాలపై తన
అభిప్రాయాలను షా మీడియాతో పంచుకున్నారు. దేశంలో ఆరోగ్యకరమైన చర్చకు ఆస్కారం
లేదన్నారు. ‘మొఘలులు దోచుకోవడానికి ఇక్కడికి రాలేదు. వారు దీన్ని తమ ఇల్లుగా
మార్చుకోవ డానికి ఇక్కడకు వచ్చారు. వారు అదే చేశారు. మొఘలులు అందరూ చెడ్డవారు
అనే ఆలోచన దేశ చరిత్రపై కొందరికి ఉన్న అవగాహన లోపాన్ని చూపుతుంద’ని షా
అన్నారు. భారతదేశపు స్వదేశీ సంస్కృతి ఖర్చుతో వెలువడిన చరిత్ర పుస్తకాలు
మొఘల్‌ల వైభవాన్ని ఎక్కువగా వర్ణించవచ్చు. అయితే చరిత్రలో వారి సమయాన్ని
విపత్తుగా భావించకూడదని అన్నారు.
మొఘల్ సామ్రాజ్యం అంత రాక్షసంగా ఉంటే, దానిని వ్యతిరేకించే వారు..వారు
నిర్మించిన కట్టడాలను ఎందుకు పడగొట్టరని నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. వారు
చేసినదంతా తప్పయితే తాజ్ మహల్‌ను పడగొట్టండి, ఎర్రకోటను పడగొట్టండి, కుతుబ్
మినార్ను పడగొట్టండి. ఎర్రకోటను మనం ఎందుకు పవిత్రంగా భావిస్తాము, దీనిని
మొఘల్ నిర్మించారు కదా? అన్నారు.మనం వారిని కీర్తించాల్సిన అవసరం లేదని,
అలాగే వారిని దూషించాల్సిన అవసరం కూడా లేదన్నారు.టిప్పు సుల్తాన్‌పై
దుమ్మెత్తిపోస్తుంటారని, ఆంగ్లేయులను తరిమికొట్టేందుకు ప్రాణాలర్పించిన
వ్యక్తి ఆయన అన్నారు. ‘మీకు టిప్పు సుల్తాన్ కావాలా లేక రామ మందిరం కావాలా?’
అంటే, ఇది ఎలాంటి లాజిక్? చర్చకు చోటు ఉందని నేను అనుకోను, ఎందుకంటే వారు నా
దృక్కోణాన్ని ఎప్పుడూ చూడలేరు, అలాగే నేను వారి అభిప్రాయాన్ని ఎప్పుడూ
చూడలేనని షా పేర్కొన్నారు.