కేజీఎఫ్ సినిమాతో ప్రపంచానికి కన్నడ సినీ పరిశ్రమ వ్యాల్యూ ఏమిటో
తెలిసివచ్చింది. ఇటీవల కాంతార సినిమాతో మరోసారి కన్నడ సినిమా ప్రభంజనం
సృష్టించింది. ఈ రెండు సినిమాలని కూడా హోంబలే ఫిలింస్ నిర్మించింది. ప్రస్తుతం
కన్నడ సినీ పరిశ్రమలో హోంబలే ఫిలిమ్స్ టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో ప్రధాని
మోదీ హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందుర్, కేజీఎఫ్ హీరో యశ్, కాంతార హీరో
రిషబ్ శెట్టి, మరికొంతమంది కన్నడ సినీ వ్యక్తులని కలిశారు. వారితో ప్రధాని
సినీ పరిశ్రమ గురించి, సినీ పరిశ్రమ సమస్యలు, తదితర అంశాలపై మాట్లాడి ఇటీవల
వారు సాధించిన విజయాల్ని అభినందించారు. ఏరో ఇండియా 14వ ఎడిషన్ ప్రారంభోత్సవం
కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరుకు వచ్చారు. ఏరోస్పేస్ ఎగ్జిబిషన్
సందర్భంగా కన్నడ సినీ పరిశ్రమలోని ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు.
ప్రధానితో సమావేశం అయ్యాక హీరో యశ్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీని కలవడం
చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమ పట్ల ఆయనకు ఉన్న నాలెడ్జి, విజన్ అద్భుతం.
మనకి ఏమి కావాలి, పరిశ్రమ దేశానికి ఏం చేయగలదు అని అన్ని రకాల సమస్యల గురించి
కూడా అడిగి తెలుసుకున్నారు. మా సినిమాలని, మా కష్టాన్ని అభినందించారు. ఆయన్ని
కలవడం ఒక అద్భుతమైన అనుభవం అని తెలిపారు.
అనంతరం కాంతార హీరో రిషబ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ఒక గొప్ప
నాయకుడు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉంది. కన్నడ పరిశ్రమలో ఏం జరుగుతోంది,
పరిశ్రమ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మనకు ఏమన్నా అవసరాలు ఉంటే
అడగమన్నారు. పరిశ్రమకి వారి తరపున చేయగలిగే సాయం చేస్తామన్నారు. కాంతార
సినిమాని అభినందించారు అని తెలిపారు.