సినీ పరిశ్రమలో ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా
లవ్ ట్రాక్ లు నడుస్తుంటాయి. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి.
1970లో కూడా ఇలాంటి ప్రేమ వార్తలు వినిపించేవి. వాటిల్లో ప్రముఖంగా హీరోయిన్
రేఖ ప్రేమ కబుర్లు వినిపించేవి. నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రేఖ..
ఎక్కువగా లవ్ ఎఫైర్స్ తో వార్తల్లో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో
పీకల్లోతు ప్రేమలో ఉండేది. కానీ, ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు.
తల్లిని శాంతిపజేయడానికి వినోద్ మెహ్రా ఎంతో ప్రయత్నించాడు. కానీ, ఆమె కోపం
చల్లారలేదు. రేఖను తీవ్రంగా అవమానించారు. వీటిని తట్టుకోలేకపోయిన రేఖ..
కన్నీరు పెట్టుకుంటూ వినోద్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇంత గొడవ జరిగిన తరువాత
కూడా కొన్నాళ్లపాటు వినోద్-రేఖ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ
పరస్పర అంగీకారంతో విడిపోయారు. వినోద్ తల్లి తనను కోడలిగా అంగీకరించడానికి
ఇష్టపడలేదని గతంలో రేఖ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత ముఖేష్ అనే
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది రేఖ. అతడు పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య
చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా అందరూ రేఖనే తప్పుబట్టారు.
నటుడిగా, నిర్మాతగా తన జీవితకాలంలో వినోద్ మెహ్రా100కు పైగా చిత్రాల్లో
కనిపించాడు. అతను 1958 చలనచిత్రం రాగిణితో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం
చేశాడు. ఆపై సినిమాల్లో పురుష ప్రధాన పాత్రలను పోషించాడు. అతని సినీ కెరీర్ లో
చాలా మంది అగ్రశ్రేణి నటీమణులతో అలరించాడు. కానీ రేఖతో అతని కెమిస్ట్రీ వారి
అభిమానులను ఎంతో అలరించింది. వీరిద్దరూ కలిసి ఘర్, ఔరత్ ఔరత్ వంటి ఎన్నో హిట్
సినిమాలు చేశారు.