అంతర్జాతీయ వేదికల్లో భారతీయ కళాకారులు సత్తా చాటుతున్నారు. ఆర్.ఆర్
అర్.సినిమాతో రాజమౌళి, ఎం ఎం కీరవాణి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.
ప్రస్తుతం అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ ని కూడా గెలవడానికి రేస్ లో ఉన్నారు.
తాజాగా మరో భారతీయ సంగీత దర్శకుడు కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకుంటూ
ఇండియాని రిప్రెజెంట్ చేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు
రికీ కేజ్ గ్రామీ అవార్డును అందుకున్నాడు. ఆల్బం సాంగ్స్ చేసే ఈ దర్శకుడు పలు
సినిమాలకు కూడా పని చేశాడు. ఇక ఈ దర్శకుడు చేసిన ‘డివైన్ టైడ్స్’ ఆల్బం 2023
కు గాను ‘బెస్ట్ ఇమ్మెర్సివ్ ఆడియో ఆల్బం’ కేటగిరీలో గ్రామీ అవార్డును సొంతం
చేసుకుంది. అయితే రికీ కేజ్ ఈ అవార్డుని గెలుచుకోవడం మొదటిసారి కాదు. ఈ
దర్శకుడు ఇప్పటికే మూడు సార్లు ఈ అవార్డుని అందుకున్నాడు. మొదటి సారిగా 2015లో
‘విండ్స్ అఫ్ సంసార’ ఆల్బం ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బం’ క్యాటగిరీలో అవార్డుని
కైవసం చేసుకుంది. రెండోసారి 2022 లో ‘డివైన్ టైడ్స్’ ఆల్బం కు గాను ‘బెస్ట్
న్యూ ఏజ్ ఆల్బం’ క్యాటగిరీలో అవార్డుని అందుకున్నాడు.
2022, 2023 లో అందుకున్న అవార్డులు ఒకే ఆల్బంకి కావడం గమనార్హం. ఇక ఈ
విషయం గురించి నామినేషన్ సమయంలో రికీ కేజ్ మాట్లాడుతూ.. డివైన్ టైడ్స్ ఆల్బం,
గ్రామీ అవార్డుకు రెండవసారి నామినేట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. నా సంగీతం
క్రాస్-కల్చరల్ అయినప్పటికీ, దాని మూలాలు మాత్రం భారతీయ సంగీతానివే అంటూ
చెప్పుకొచ్చాడు. ఇక వరసగా రెండు సార్లు, మొత్తం 3 గ్రామీ అవార్డులు
అందుకోవడంతో రికీ కేజ్ కి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు