ప్రముఖ నేపథ్య గాయని, సీనియర్ సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి
చెందారు. ఈ ఘటన భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శనివారం నాడు
ఆమె చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
వంటమనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా..
అప్పటికే చనిపోయి ఉన్నారు. దీంతో ఆమె పార్థివ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం
ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కొద్దిసేపటి క్రితమే
డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం చెన్నైలోని ఫ్లాట్‌కు వాణీ
జయరామ్ పార్థివదేహాన్ని తరలించారు. ఆమెను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు
తరలివస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అధికారులు పోలీసు బందోబస్తు
ఏర్పాటు చేశారు.
వాణీ జయరామ్ మృతిపై అభిమానులు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలున్నాయి.
దీంతో ఈ ఘటన ఓ మిస్టరీగా మారింది. ఆమె నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో
అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమెకు
బలంగా గాయాలయ్యాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు
బయటికొస్తే.. వాణీ జయరామ్ ఎలా చనిపోయారు..? కారణాలేంటి..? అనే విషయాలు
తేలిపోనున్నాయి. రిపోర్టు కోసం అటు అభిమానులు.. ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు
వేచి చూస్తున్నారు. మరోవైపు.. వాణీ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు
సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.