ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం
ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ సినిమాలోని ‘నాటు నాటు…’
పాటకు ఆస్కార్ నామినేషన్ లభించిన సంతోషంలో ఉన్న కీరవాణి కుటుంబం, అభిమానులు
తాజా పద్మ పురస్కారంతో అమితానందంలో ఉన్నారు. అదేవిధంగా నటి, సీనియర్ హీరోయిన్
రవీనా టాండన్ కూడా పద్మ శ్రీ అందుకోనున్నారు. ఇక ప్రముఖ సంగీత కళాకారుడు,
తబలా విద్వాంసుడు, నటుడు జాకిర్ హుస్సేన్ ను పద్మ విభూషణ్ పురస్కారంతో కేంద్ర
ప్రభుత్వం సత్కరించింది. మహారాష్ట్ర నుంచి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

74వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు రాత్రి పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో
కళాకారులు పేర్లు చేర్చారు. రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో భారత
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలను
ప్రకటించిన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో విజేతలకు
అభినందనలు తెలిపారు. “పద్మ అవార్డులు పొందిన వారికి అభినందనలు. భారతదేశానికి
వారి గొప్ప, వైవిధ్యమైన సహకారాన్ని, మన వృద్ధి పథాన్ని మెరుగుపరచడానికి వారి
ప్రయత్నాలను గౌరవిస్తుంది..” అని ట్వీట్ చేశారు.