▪జగన్ ను మరోసారి సీఎం చేసుకోవడమే లక్ష్యం
▪ఉరవకొండ వైసీపీ అభ్యర్థిని గెలిపించి జగన్ కు కానుకగా ఇద్దాం
▪క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
-ఉరవకొండ వైసీపీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఈసారి జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ప్రతి
కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, అనంతపురం
జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.175
గెలిస్తే మరో ముప్పై ఏళ్ళు మనదే ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం
అనంతపురం జిల్లా ఉరవకొండలోని సత్యం కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ చార్జ్,
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వైస్సార్సీపీ నియోజకవర్గ
విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇన్చార్జ్
మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి,
అనంతపురం, చిత్తూరు ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డప్ప, జెడ్పీ చైర్ పర్సన్
గిరిజమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ
పార్టీ పరిశీలకుడు చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు,యువనేత ప్రణయ్ రెడ్డి
తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ వ్యాప్తంగా అన్ని
నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు తయారు
చేశామన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని క్యాడర్ కు భరోసా
ఇచ్చారు.ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక
ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నని
అన్నారు.అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని సూచిస్తే ఆ అభ్యర్థి విజయానికి
ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసే పార్టీని గెలిపించాలన్నారు. పార్టీలో ప్రతి
ఒక్కరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని
ఆయాన హెచ్చరించారు.రాబోయే ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసే జగన్మోహన్ రెడ్డి
ఆశయాలు కనుగుణంగా 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని సూచించారు. ఎల్లో మీడియా
ప్రచారాన్ని నమ్మేస్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. బీసీలకు పెద్దపీట వేసి
వారిని ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత వైఎస్ఆర్సిపిదే అన్నారు.ఈ సారి అందరూ
కలిసి కట్టుగా పనిచేసి ఉరవకొండ వైస్సార్సీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు.
ఈసారి ఉరవకొండ గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తాం..:విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి కి కానుకగా ఇస్తామని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదన్నారు.కేవలం
మొక్కుబడిగా కార్యక్రమాలో పాల్గొంటున్నాడని ఎద్దేవా చేశారు.ఒక్కరోజైనా ప్రజా
సమస్యలపై ఉద్యమాలు చేసినా పాపాన పోలేదని విమర్శించారు.హంద్రీనీవా ద్వారా
బెలుగుప్ప మండలంలోని చెరువులకు నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ
ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కన్వీనర్లు,
జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మైనార్టీ
నేతలు,డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.