భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అనంతపురం
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించాలన్న
ఉద్దేశంతో తుదిశ్వాస వరకు అంబేడ్కర్ పోరాడారన్నారు. డాక్టర్ బీఆర్
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో,
జెడ్పీ సమీపంలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాప్రతినిధులు, వైసీపీ
నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అనంత నివాళి అర్పించారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని
కొనియాడారు. దేశమంతా ఈ రోజు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే అది అంబేడ్కర్
రచించిన రాజ్యాంగం వల్లేనని అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు మెరుగైన
విద్యను అందించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించి రాష్ట్రంలో
విద్యకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బీఆర్
అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించాలని కోరారు.