●పేద పిల్లలు డ్రాపౌట్స్‌గా మారకూడదనే ‘అమ్మ ఒడి’
●‘జగనన్న విద్యా దీవెన’ ప్రారంభంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాష్‌రెడ్డి
మనం ఎంత ఇచ్చినా పేదరికం దూరం కాదు. విద్య కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి
విద్యారథుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారి కుటుంబం, సమాజం అభివృద్ధి
చెందాలంటే విద్య ఒక్కటే మూలం అని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారని రాప్తాడు
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని
సిఆర్‌ఐటి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఖర్చు చేసే మొత్తంతో దేశం
సర్వతోముఖాభివృద్ది చెందుతుందని సిఎం గట్టిగా నమ్మారు. కాబట్టే పాఠశాల
స్థాయిలో పిల్లలు డ్రాపౌట్స్‌గా మారకూడదనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ అనే పథకానికి
శ్రీకారం చుట్టారన్నారు.
👉మన ఆలోచనా పరిధి పెరగాలంటే విద్య అనేది చాలా ముఖ్యం. చదువుతోనే టెక్నాలజి,
ఇన్నోవేషన్ అనేది సాధ్యం. సాంకేతికంగా ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నామంటే
కేవలం చదువు కారణంగానే. గతంలో అనేక జబ్బులకు వైద్యం లేక ప్రాణాలు
కోల్పోయేవారు. ఇప్పుడు చదువు, టెక్నాలజీతో రకరకాల మందులు కనుగొంటున్నారు.
తద్వారా మానవాళిని కాపాడుకుంటున్నాం.
👉రాజకీయాల్లోకి చదువుకున్నవారే రావాలి. ఫలానా పని చేయడం వల్ల ఎంతమందికి మేలు
జరుగుతుంది, ఎంతమందికి నష్టం జరుగుతుంది అని పలు విధాలుగా ఆలోచించే శక్తి
ఉంటుంది. ప్రపంచంలో ఏం జరుగుతోంది..మన చుట్టు గ్రామాలకు ఏమి అవసరం ఎలా చేయాలి
అనే ఆలోచించే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే చదువుకున్న యువత రాజకీయాల్లోకి
రావాలి.
👉నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివా. నాతో పాటు చదివిన వాళ్లలో 95
శాతం మంది విదేశాల్లో ఉన్నారు. ఆర్థికంగాఅందరూ సంతోషంగా ఉన్నారు. అయితే అమ్మ
దగ్గర లేము, సొంతూరులో లేము, స్నేహితులు, బంధువులతో లేము అనే వెలితి
వారికుంది. కానీ ఇక్కడా ఆ అభివృద్ది జరగాలి. కంప్యూటీకరణ కారణంగా 1995 తర్వాత
ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూశాయి. ప్రపంచంలో భారతీయుడికి ఉన్న విజ్ఞత,
జ్ఞానం మరెవరికీ లేదు.
👉మన పిల్లలందరూ గొప్ప స్థాయికి ఎదగాలి. ప్రపంచాన్ని ఏలేటువంటి పాలేగాళ్లు
కావాలని జగన్మోహన్రెడ్డి‘అమ్మ ఒడి’, ‘సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్’
పథకాలకు శ్రీకారం చుట్టారు. అందుకే విదేశీ విద్యను కూడా తీసుకొచ్చారు.
రాప్తాడు నియోజకవర్గంలో 8287 మంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి
పొందుతున్నారు. 7421 మంది తల్లుల ఖాతాల్లో 5.37 కోట్లు ఈరోజు జమ చేస్తున్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని
ఆకాంక్షించారు. అనంతరం మెగా చెక్కును విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో
ఏబిసిడబ్ల్యూఓ సుభాషిణి, కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు,
ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, పాల్గొన్నారు..