రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, హాండ్ లూమ్స్ , టైక్స్ టైల్స్ శాఖ మంత్రి గుడివాడ
అమరనాథ్
కాకినాడ యాంకరేజి పోర్టు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
కాకినాడ : పారిశ్రామిక అభివృద్ది, ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలకు కాకినాడ
తీరం త్వరలో రాష్ట్రంలోను, దేశంలోను తలమానికంగా రూపు దిద్దుకోనుందని రాష్ట్ర
పరిశ్రమలు, ఐటి, హాండ్ లూమ్స్ , టైక్స్ టైల్స్ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్
తెలిపారు. శుక్రవారం 90 కోట్ల నిధులతో కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్దికి
చేపట్టిన వివిధ పనులకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, హాండ్ లూమ్స్ , టైక్స్ టైల్స్
శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక కాకినాడ
సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి
అమరనాధ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 వేల మంది కార్మికులకు
ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న కాకినాడ యాంకరేజి పోర్టు
ఆధునీకరణ పనులకు మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన రోజే తొలి సంతకం చేసే
అదృష్టం తనకు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం తనకు కల్పించిన
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిజేశారు.
స్వాతంత్య్రానంతరం దశాబ్దాలు కాలంగా కాకినాడ యాంకరేజి పోర్టు నిరాదరణకు
గురైందని, ఈ పోర్టు మూసివేస్తారని, ఇకపై ఎటువంటి కార్యకలాపాలు లేక దీనిపై
ఆధారపడిన కార్మికులు రోడ్డున పడాల్సిందేనని ప్రతిపక్షాలు అపోహలను కల్పిస్తూ
దుష్పచారం చేసారన్నారు. వాటన్నిటినీ త్రిప్పికొడుతూ పోర్టుపై ఆధారపడిన కార్మిక
సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ యాంకరేజి పోర్టు పునరుద్దన కొరకు 100
కోట్లు నిధులు కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఈ
అబివృద్ది పనులతో ప్రస్తుత పోర్టు సామర్థ్యం 4 మిలియన్ టన్నులతో పాటు మరో
మిలియన్ టన్ను మేరకు పెరుగుతుందని, అలాగే మరో ఐదు వేల మందికి నూతనంగా ఉపాధి
లభించనుందని మంత్రి తెలిపారు. యాంకరేజి పోర్టుకు పూర్వ వైభవం తెచ్చి వేలాది
మంది కార్మికుల జీవితాలను నిలబెట్టాలనే తపనతో స్థానిక శాసన సభ్యులు, ఎంపిలు
చేసి కృషి అభినందనీయమన్నారు. దేశంలో రెండవ అతి పెద్ద సముద్ర తీరం 970 కిమీలు
మన రాష్ట్రానికి సహజ సంపదగా ఉందని, నూతన పోర్టులతో తీరాన్ని అభివృద్ది
చేయాలని, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మారిటైమ్ బోర్డు ను ముఖ్యమంత్రి
ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే ఉన్న విశాఖపట్టనం, గంగవరం, కాకినాడ డిప్ వాటర్
పోర్టు, యాంకరేజి పోర్టు, రవ్వ, కృష్ణపట్టణం లలోని 6 పోర్టులతో పాటు, మరో మూడు
పోర్టు లు చేపట్టడం జరిగిందన్నారు. 3500 కోట్ల నిధులతో రామయ్యపట్నంలో
ఇప్పటికే చేపట్టగా, మచిలీపట్టనంలో మరో 4000 కోట్ల నిధులతో మరో పోర్టు
నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి జన్మదినమైన డిశంబరు 21వ
తేదీన ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అలాగే కాకినాడలో
కేఎస్ఈజడ్ పోర్టు నిర్మాణం త్వరితగతిన జరుగుతుండగా, శ్రీకాకుళం జిల్లాలోని
భావనపాడు పోర్టును కూడా త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. వీటన్నిటినీ
పూర్తి చేసి 10 పోర్టులతో, అత్యధిక ఆదాయాన్ని అందించే రాష్ట్రంగా చరిత్రలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిలబోతోందని మంత్రి పేర్కొన్నారు. కేవలం పోర్టులే
కాకుండా, ఫిష్షింగ్ హార్భర్ల అవసరాన్ని కూడా గుర్తించి 9 పిష్షింగ్ హార్బర్ల
అభివృద్దికి ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఇప్పటికే 4 పిష్షింగ్ హార్బర్ల
నిర్మాణం జరుగుతున్నాయని, జువ్వెలదిన్నె పిష్షింగ్ హార్బర్ ను వచ్చే జనవరిలో
ప్రారంభించ నుండగా, కాకినాడ తీరంలోని ఉప్పాడ పిష్షింగ్ హార్బర్ లో దాదాపు 270
కోట్ల నిధులతో మరొక హార్బర్ చేపట్టబోతున్నామని తెలిపారు. దేవుడిచ్చిన వరంలాంటి
సముద్ర తీరాన్ని 10 పోర్టులు, 9 పిష్షింగ్ హార్బర్లతో పూర్తి స్థాయిలో
సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే
అని తెలిపారు. వీటితో లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు, తీరం వెంబడి
పరిశ్రామిక అభివృద్దికి దోహదం చేయనుందన్నారు. బల్క్ డ్రగ్ పార్కు కోసం దేశంలో
17 రాష్ట్రాలు పోటిపడినా దేశంలో ఈ అవకాశం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లతో పాటు
కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కిందని, ఈ పార్కు కాకినాడ తీరంలోనే
ఏర్పాటు కానుందన్నారు. 1000 కోట్ల నిధులతో ఏర్పాటు కానున్న ఈ బల్క డ్రగ్
పార్కు ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 20 వేల మందికి పరోక్షంగాను
ఉపాధి లభించనుందన్నారు. అయితే ఈ అభివృద్దిని చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష
నాయకులు కడుపుమంటతో ఈ పార్కు వల్ల నష్టం జరుగుతుందని లేఖలు రాయండం
దురష్ట్రకరమని, ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే
దేశంలో అత్యధికంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్న కాకినాడ యాంకరేజి పోర్టుపై కూడా
మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని బురద జల్లి దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆవేదన
వ్యక్తం చేస్తు ఇటువంటి వారిని త్రిప్పి కొట్టి పోర్టును రక్షించుకోవలసిన
బాద్యత కార్మికులపై కూడా ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా ఉన్న ఉమ్మడి తూర్పు
గోదావరి జిల్లాను రానున్న కాలంలో పారిశ్రామిక ప్రాముఖ్యత కలిగిన జిల్లాగా
మలచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో విశాఖపట్టనం,
కాకినాడ తీరంలో రూపుదిద్దుకోనున్న పెట్రో కెమికల్ కారిడార్ దేశానికే తలమానికం
కానుందని తెలియజేశారు. పారిశ్రామికా అభివృద్దితో పాటు ఈ ప్రాంతంలో ఐటి రంగ
అభివృద్దికి కూడా చర్యలు చేపడతామన్నారు. యాంకరేజి పోర్టు కార్మికులు తన
దృష్టి తెచ్చిన సమస్యలను ముఖ్యమంత్రికి దృష్టికి తెలిపి సానుకూల పరిష్కారం
అందిస్తామని మంత్రి అమరనాథ్ తెలిపారు.
కార్యక్రమంలో కాకినాడ లో తొలిసారిగా 8వేల టన్నుల సామర్థ్యంతో బ్రోత్రా
షిప్పింగ్, సాన మెరైన్ సంస్థల ద్వారా నిర్మించిన షిప్పును మంత్రి అమరనాథ్
ప్రారంభించారు. కాకినాడలో నౌకా నిర్మాణ రంగ అభివృద్దికి ఈ షిప్ నాంది
పలుకనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి
సంక్షేమం, సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన
శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్దితో
పోర్టు పై ఆధారపడిన 30 వేల కార్మికుల జీవితాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు
భరోసా నింపారన్నారు. పేదరింకంపై పోరాటానికి పేదలకు నవరత్నాలను ఆయుధంగా ఇచ్చి,
కష్టంలో ఉన్న ద్రౌపతిని ఆదుకున్న శ్రీకృష్ణ పరమాత్మునిలా రాష్ట్ర ముఖ్యమంత్రి
పేదలను ఆదుకుంటున్నాన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలోను, జిడిపి వృద్దిలోను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో పయనిస్తోందని, ఓర్వలేని ప్రతిపక్ష
నేతలు, పక్షపాత మీడియా విష ప్రచారానికి పాల్పడుతున్నాయన్నారు. కాకినాడ ఎంపి
వంగాగీత మాట్లాడుతూ జిల్లాలో పోర్టులు అభివృద్ది పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,
పెరుగుతున్న పారిశ్రామిక విస్తరణ అవసరాల దృష్ట్యా విమానాశ్రయాన్ని కూడా మంజూరు
చేయాలని మంత్రి అమరనాథ్ ను కోరారు. ఎపి మారిటైం బోర్డు చైర్మన్
కె.వెంకటరెడ్డి, కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ
రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడు దశాబ్దాలుగా నిరాదరణకు గురైన
కాకినాడ యాంకరేంజి పోర్టు పూర్వ వైభవాన్ని అందుకోనున్నందుకు ఆనందం వ్యక్తం
చేశారు. కార్యక్రమానికి ఎపి మారిటైం బోర్డు డిప్యూటీ సిఈఓ
బి.యం.రవీంద్రరెడ్డి, స్వాగతం పలుకగా, జిల్లా కలక్టర్ డా.కృతికా శుక్లా
ప్రారంబోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ రాగిరెడ్డి
చంద్రకళాదీప్తి , కాకినాడ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, రైస్ మిల్లర్స్
అసోసియేషన్ అధ్యక్షలు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, పోర్టు ఆఫిసర్ కెప్టెన్
కె.శ్రీ ధర్మ శాస్త, మెరైన్ ఎస్ఈ జి.వి.రాఘవరావు, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్
అధ్యక్షులు వారణాసి రాఘవులు, కార్మిక సంఘాల నేతలు ఎ.సత్తిబాబు, పి.నూకరాజు,
వీరబాబు తదితరులు పాల్గొన్నారు.