యజ్ఞంలా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరు : రాష్ట్రంలో ఇల్లు లేని లక్షలాది మంది నిరుపేదలకు గృహ యోగం
కల్పించాలనే గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు-
పేదలందరికీ అమలు చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు
వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ పథకం కోసం రాష్ట్ర
ప్రభుత్వం రూ.5,655 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. నిర్దేశించుకున్న సమయంలోగా
ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పై
నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారని అన్నారు. దేశంలో
జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని,
అతివేగం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని
విజయసాయి రెడ్డి తెలిపారు. గత సంవత్సరం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై జరిగిన
రోడ్డు ప్రమాదాల్లో 53615 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రోడ్డు
ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారిలో 34.5% మంది జాతీయ రహదారుల పైన జరిగిన
ప్రమాదాల్లో చనిపోయినవారేనని అన్నారు. కావున వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు
పాటిస్తూ, వేగాన్ని నియంత్రిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని,
విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు.