హాజరైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ : విద్యార్థులు ఆనందంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి
బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఏపీ పోలీ టెక్ ఫెస్ట్‌ను బొత్స
ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయానికి
వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. చదువుకున్న విద్యార్థులు
రాష్ట్రానికే కాదు దేశానికి ఆస్తి అవుతారని సీఎం భావిస్తారని తెలిపారు.
విద్యార్థులలోని సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని
స్పష్టం చేశారు. జ్యోతి ప్రజ్వలన కూడా ఇక్కడ టెక్నాలజీనీ ఉపయోగించారన్నారు.
పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లు చాలా బాగా జరిగాయని మంత్రి హర్షం
వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లక్ష 70 వేల మంది పోలిటెక్నిక్లో చదువుతున్నారని తెలిపారు. గత
ప్రభుత్వాలు విద్యదీవెన మొక్కుబడిగా ఇచ్చారని విమర్శించారు. 14 సంవత్సరాలు
మంత్రిగా చేశానని, అయితే విద్యపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం జగన్
ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్య
వ్యవస్థలో మార్పులు చేస్తున్నామన్నారు. ఈ దశలో ఒక లక్ష్యం ప్రతి ఒక్కరిలో
ఉండాలని, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు మంత్రి బొత్స
సత్యనారాయణ సూచించారు.
విజయవాడలో ఏపీ పాలీటెక్ ఫెస్ట్ ప్రారంభం : నగరంలో ఏపీ పాలీటెక్ ఫెస్ట్
ప్రారంభమైంది. ఈ ఫెస్ట్‌కు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా
హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్ధులు పెద్దఎత్తున ఏపీ
పాలీటెక్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ ఫెస్ట్‌లో విద్యార్ధుల 253 ఇన్నోవేటివ్
ప్రాజక్ట్ల ప్రదర్శన జరుగనుంది. విద్యార్ధుల ఇన్నోవేటివ్ ప్రాజక్ట్లలో
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.25 వేలను గెలిచిన
విద్యార్థులకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వనుంది.