విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా గిడుగు రుద్రరాజు ను
ఏఐసీసీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా గురువారం ఆయ మీడియాతో
మాట్లాడుతూ పార్టీని బలోపేత చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అందరినీ
కలుపుకుంటూ ముందుకు వెళతామని, ప్రజా సమస్యలు, విభజన హామీలపై పోరాటం చేస్తామని
స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని, ప్రధానంగా
కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. సామాన్య కార్యకర్తలకు
గుర్తింపు ఉంటుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్గా,
ఎమ్మెల్సీగా, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం పార్టీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పార్టీ
కష్టకాలంలో ఉందని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. దేశ
వ్యాప్తంగా రాహుల్ గాంధీకి మంచి ఆదరణ పెరుగుతోందని అన్నారు. పొత్తుల విషయంలో
అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.