ప్రయోజనం కనిపించడం లేదు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత
సాధ్యమవుతుంది…’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ‘ఉత్తరాంధ్ర
అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలంటున్నారు. మరి రాయలసీమకు ఒక
రాజధాని కావాలని అక్కడి ప్రజలు డిమాండు చేస్తున్నారు. దీని వల్ల ప్రాంతాల మధ్య
విభేదాలు తలెత్తుతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. విశాఖను పరిపాలన రాజధాని
చేసినంత మాత్రాన ఏమీ జరగదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభ సాక్షిగా
తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాను ఒక రాజధానిగా తయారు చేస్తే
అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నది తన వ్యక్తిగత
అభిప్రాయమన్నారు. బుధవారం విశాఖపట్నం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ ఆంధ్రుడా మేలుకో ’
కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు.
నిర్వాహకులు ప్రియాంకారావు, జగన్ మురారి తమ డిమాండ్లను లక్ష్మీనారాయణకు
వివరించారు. వారి డిమాండ్లతో ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం
విలేకరులతో మాట్లాడుతూ ‘మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను ఒక రాజధానిగా
అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తవు. అక్కడ 22 ఏళ్లు
పని చేసిన అనుభవంతో చెబుతున్నా. ఆ రాష్ట్రంలో అనేక పట్టణాలు వృద్ధి చెందాయి.
ముంబయి, పుణే, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో
పరిశ్రమలొచ్చి ఉద్యోగాలు పెరిగాయి. అక్కడి ప్రజలు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాల
కోసం ఎక్కడా పెద్దగా కనిపించరు. మనవాళ్లు మాత్రం ఉద్యోగాలు లేక అన్ని
రాష్ట్రాల్లో ఉంటారు. ఏపీలోనూ ప్రతి జిల్లాను ఆ విధంగా తీర్చిదిద్దితే మనకూ
ఎక్కడికీ వెళ్లాల్సిన గతి పట్టదని వివరించారు.
తమిళనాడులో ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకువెళ్తుందన్నారు. ‘హైకోర్టు
ప్రిన్సిపల్ బెంచ్ ముంబయిలో ఉంటుంది. నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లో రెండు
బెంచ్‌లు ఏర్పాటు చేశారు. అదే విధంగా అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్
పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లోని న్యాయపరమైన
సమస్యలను అక్కడికి తీసుకువెళ్లవచ్చు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగ్‌పూర్‌లో
జరుగుతాయి. ఇక్కడా శీతాకాల సమావేశాలు విశాఖ, కర్నూలులో పెట్టుకోవచ్చని జేడీ
లక్ష్మీనారాయణ సూచించారు. ఒకే ప్రాంతంలో అన్ని రకాల కార్యాలయాలు ఉండే విధానం
అన్ని రాష్ట్రాల్లో ఉందని, ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించకూడదని ఏపీ
పరిరక్షణ సమితి అడుగుతుందని చెప్పారు.