మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
51వ రోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 19వ డివిజన్
వెంకటాపురం-5 సచివాలయ పరిధిలో పర్యటించిన ఆళ్ల నాని”
ఆళ్ల నానికి భారీ గజమాలలు, పూల జల్లులు, మంగళ హారతులతో ఘన స్వాగతం
మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఆళ్ల నాని
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును
లబ్ధిదారుల గడప గడపకు వెళ్లి స్వయంగా పరిశీలించిన ఆళ్ల నాని
సంక్షేమ పాలన అమలు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన లబ్దిదారులు
అర్హత ఉండి సాంకేతిక కారణాలతో సంక్షేమ పధకాలు అందని వారికి సత్వరమే లబ్ది
చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆళ్ల నాని సూచన
ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవ రత్నాల సంక్షేమ
పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటిలో సంతోషాలు వెల్లి విరిసాయని
రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని అన్నారు. గడప గడపకు
మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 51వరోజు ఏలూరు కార్పొరేషన్ 19వ డివిజన్
వెంకటాపురం-5 సచివాలయ పరిధిలోని ఎన్ టీ ఆర్ కాలనీ వైఎస్సార్ విగ్రహం వద్ద
నుంచి ప్రారంభం అయిన కార్యక్రమం అశేష జన నీరాజనాలు నడుమ ఆద్యంతం ఉత్సాహంగా
సాగింది. స్థానిక కార్పొరేటర్ యర్రంశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో స్థానిక
వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల
నానికి ఘన స్వాగతం పలికారు.
స్థానిక వైఎస్సార్ విగ్రహానికి పూలమాల ఘన నివాళులు అర్పించిన అనంతర 51వ రోజు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆళ్ల నాని లాంఛనంగా ప్రారంభించారు. గడప
గడపకు కార్యక్రమంలో భాగంగా కాలనీలోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ పధకాల అమలు
తీరును ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతి నెలా టైం కి
అందుతుందా తల్లీ, అమ్మ ఓడి వస్తుందా అమ్మా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ
మమేకమయ్యారు. ప్రతి గడపకు వెళ్లిన ఆళ్ళనాని వృద్ధులు, చిన్నారులతో మమేకం
అయ్యారు. గడప గడపలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న
సంక్షేమ పాలనతో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయని, అర్హత కలిగి ఉండి ఏదైనా మరే
ఇతర కారణంతో అయినా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారి సమస్య పరిష్కరించి
వారికి కూడా లబ్ది చేయాలనే ఉద్దేశ్యం తోనే గడప గడపకు కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులో ప్రతి గడపలో వస్తున్న అశేష
స్పందన జగనన్న సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్సనం అని ఆళ్ల
నాని అన్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్య చికిత్స
అందేలా ఆళ్ల నాని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ జగనన్న సంక్షేమ
పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంతో జీవిస్తున్నారని, పేదవాడికి
అందుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అక్కసుతో ప్రతి పక్షాలు దుష్ప్రచారం
చేస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు
జగనన్నకు అండగా నిలిచి మరోసారి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని
జగనన్నకు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారని ఆళ్ల నాని అన్నారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైరపర్సన్
పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి
శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన
రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచెమ్ మైబాబు, వైఎస్సార్ సిపి సినియర్ నాయకులు బలరాం,
నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి
కిషోర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మేతర సురేష్ బాబు కోరాడ బాబు, కో-అప్షన్
సభ్యులు మున్నుల జాన్ గురునాధ్, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయ నిర్మల,
తుమరాడా స్రవంతి, పొలిమేర దాసు, ఇనపనూరి కేదారేశ్వరీ జగదీష్, కత్తిరి
రామ్మోహన్, దేవరకొండ శ్రీనివాస్, జయకర్,
వైయస్సార్ సిపి నాయకులు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, కిలాడి దుర్గారావు,
జనపరెడ్డి కృష్ణ, నున్న కిషోర్, తోట శివ, మోటమర్రి సదానంద్, దాసరి రమేష్,
ఇనపనూరి జగదీష్, బండారు కిరణ్ కుమార్, కొల్లిపాక సురేష్, మజ్జి కాంతారావు,
యర్రంశెట్టి ఉదయ్, 19వ డివిజన్ అధ్యక్షులు కిల్లి రమణ, మిర్తిపాటి లక్ష్మణ్,
గంటా బుజ్జి, లక్ష్మణ్ మాష్టర్, బొద్దాని రమణ, s.దామోదర్, నిడికొండ నరేంద్ర,
తోటకూర కిషోర్, విఠల చంద్రశేఖర్,లక్కొజు గోపి, బోగిశెట్టి పార్వతి,
లూటుకుర్తి సుభాష్ , ఎల్లపు మోజెస్, పిట్టా ధనుంజయ్, శివరావు, భారతి వెంకట
రావు, లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, దొంగ రామాంజనేయులు,
ప్రత్తిపాటి తంబీ, మునిసిపల్ కమిషనర్ షేక్ షాహీద్, ఎమ్మార్వో సోమశేఖర్, కృష్ణ
మూర్తి, పలు శాఖల అధికారులు, అడ్మిన్ నరసింహ, వెంకటాపురం-5 సచివాలయ సిబ్బంది,
వాలంటీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు