వెలగపూడి : రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు 600 అంగన్వాడీ పోస్టుల భర్తీపై గతంలో ఇచ్చిన
స్టేను ఎత్తివేసిన ఉన్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ
చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అంగన్వాడీ
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల
ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ
గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన
ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను
ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 600 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు
భర్తీకానున్నాయి.