ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతీ, యువకులకు ఆహ్వానం
శిక్షణ అనంతరం ఫ్యాప్సీ సర్టిఫికేట్ అందజేత
విజయవాడ : డిసెంబర్ 1 నుండి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్షిప్
డెవలప్మెంట్ పై ఆన్లైన్ కోర్సు ప్రారంభం అవుతుందని.. ఈ ఆన్లైన్ సర్టిఫికేట్
కోర్సును ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతీ, యువకులు సద్వినియోగం
చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్. శ్రీధర్ రెడ్డి
బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఫ్యాప్సీ ( ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్
ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్
ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పై 10 రోజులపాటు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును
ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల
నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో
తయారీ రంగంలో, సేవా సంస్థలు, ముఖ్యంగా MSME లను స్థాపించడానికి అవకాశాలు
మెండుగా ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత లోతైన జ్ఞానాన్ని
అందించడానికి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును రూపొందించామన్నారు. తమ భవిష్యత్
వ్యాపార ప్రణాళికలను అవసరమైన అవగాహనతో పాటు నిపుణులతో నేరుగా చర్చించడానికి
అవకాశం కల్పిస్తామన్నారు. బ్యాంకింగ్ రంగంలోని MSME విభాగానికి చెందిన
నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ప్రాక్టీస్ చేస్తున్న లీగల్ ఇంప్లిమెంటర్లు,
మార్కెటింగ్ నిపుణులు, ప్రభుత్వ అధికారులు తమ నిజ జీవిత అనుభవాలను ట్రైనీలతో
పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమం మార్కెట్‌ను
గుర్తించే పద్ధతులు, ముడి పదార్థాల సేకరణ, ప్రాజెక్ట్ నివేదిక తయారీ, బ్యాంకు
నుండి రుణాలు, ప్యాకేజింగ్ & బ్రాండింగ్, చట్టపరమైన అంశాలు, FSSAI లైసెన్స్ &
రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలు & సేవలు, ఎగుమతి
అవకాశాలు, పథకాలు, విధానాలు, ప్రమాద నిర్వహణ వంటి అంశాలపై అవగాహన
కల్పిస్తారన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత అభ్యర్థులకు FAPCCI సర్టిఫికేట్
అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఫ్యాప్సీ అధికారులు S. జీవన్
9182927627 (jeevan@fapcci.in), K. శ్రీకాంత్ 9391422821 (srikanth@fapcci.in)
నెంబర్లలో సంప్రదించాలని ఎల్. శ్రీధర్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.