ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
శ్రీకాకుళం : రాజకీయమంటే జవాబుదారీతనం..ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా
ఆదరిస్తారనే మెసేజ్
పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబులా దుష్ట
చతుష్టయాన్ని నేను
నమ్ముకోలేదు. నేను దేవుడిని ప్రజలను నమ్ముకున్నానని
చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా..ఇదే
కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్
కోరారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను
ఎన్నో ఆటంకాలు, వ్యయ
ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో
సీఎం జగన్ సర్కార్ పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్
రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ
హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్
బుధవారం శ్రీకాకుళం
నరసన్నపేటలో ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే
చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో
భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప
కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల
రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి.
7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు
అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో
సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు
పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే
పూర్తి అవుతందిని సీఎం జగన్ తెలిపారు.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్
వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే
పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే.
సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు
వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తాం. ప్రతి
కమతానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. హద్దు
రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం
ఇవ్వబోతున్నాం.
క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం.
సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను
నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం
చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను
రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో
జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన
గ్రామాల్లో, గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
ఎవరూ మోసం చేయడానికి వీల్లేకుండా వ్యవస్థను
మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని
సీఎం జగన్ పేర్కొన్నారు.