అడుక్కునేవాడిలా చివరి అవకాశమట..
ఓర్వలేకే జగన్ పై వ్యక్తిగత దూషణలు
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శలు
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి నిజం మాట్లాడారని, 2024 ఎన్నికలే
అయనకు చివరి ఎన్నికలు కానున్నాయని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
పేర్కొన్నారు. చంద్రబాబుకే ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని ఆయన ఎద్దేవా
చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనంతపురం
జిల్లా కూడేరు మండలం లెప్రసి కాలనీ, బ్రాహ్మణపల్లి, పొట్టిచెరువు గ్రామాల్లో
ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ ఆశాలత తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి
కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్లెట్లు పంపిణీ
చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి
బాగులేదనడానికి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శమన్నారు. చంద్రబాబు
మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారన్నారు. ఈనాడు రామోజీరావు తో భేటీ ఆయన
తరువాత చంద్రబాబు డ్రిపేషన్ లోకి వెళ్ళారని, బహుశా తెలుగుదేశం ఇక అధికారం లోకి
రాదని ఆయన చెప్పివుంటారన్నారు. కర్నూల్ జిల్లా పర్యటనలో అడుక్కునేవాడిలాగా
చివరి అవకాశం ఇవ్వండనడం ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు ప్రజలు
వైఎస్సార్సీపీని రోజు రోజుకూ బలపరుస్తుండడం తో చంద్రబాబులో ఫ్రస్టేషన్
పెరిగిపోయిందన్నారు. కర్నూలు రోడ్ షోలో ముఖ్యమంత్రి పై చంద్రబాబు చేసిన
వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. న్యాయ రాజధాని కోసం చంద్రబాబును ప్రశ్నిస్తే
నిరసనకారులను గుడ్డలుడదీసి కొడతా అనడం దారుణమన్నారు.14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా
పనిచేసిన వ్యక్తి వాడే భాషేనా అది అన్నారు. చంద్రబాబు మానసిక స్థితిని చూసి
ప్రజలు ఇదేం కర్మ అంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలోనూ
వైఎస్సార్సీపీదే గెలుపన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై
చెబుతారని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.