విశాఖపట్నం : భారత దేశం ఇప్పుడు పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేంద్ర
మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రోజ్ గార్ యోజన కింద ఉద్యోగాలు పొందిన యువతీ,
యువకులకు కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జీ-20 దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు లభించిందని చెప్పారు. అలాగే
ప్రపంచ స్థాయి నాయకత్వం, పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారని
పేర్కొన్నారు. ఇది మనకు మంచి అవకాశమని వెల్లడించారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు
పొందిన యువకులు దేశం కోసం శక్తియుక్తుల పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనా
కంటే ముందు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యాక్సిన్ కోసం విమానాల వైపు
ఎదురు చూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ను
అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని వివరించారు. భారత యువకులు
తమ మేథస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని కోరారు. స్వాతంత్ర్యం
వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలోనే జాతీయ రహదారుల అభివృద్ధి ఎక్కువగా జరిగిందని
కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు