నేడు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకం ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్
రెడ్డి
గుంటూరు : వంద సంవత్సరాల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ
రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ
కార్యక్రమం, రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్
సేవలు అందనున్నాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ మోహన్
రెడ్డి బుధవారం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్
జగన్ ప్రభుత్వం మహా యజ్ఙాన్ని చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని భూముల
రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి
ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 డిసెంబర్ 21న ‘‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ
హక్కు మరియు భూ రక్ష పథకాన్ని’’ ప్రారంభించింది. రెండు వేల గ్రామాల్లో రీసర్వే
సమయంలో, రైతులు దరఖాస్తు చేసుకోకుండా 8–9 నెలల వ్యవధిలో 4.3 లక్షల
సబ్డివిజన్లు మరియు 2 లక్షల మ్యుటేషన్లు భూమి మరియు రెవెన్యూ రికార్డులలో
జరిగాయి. మీసేవ మరియు గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి సంవత్సరం స్వీకరించబడిన
35వేల సబ్‌డివిజన్ దరఖాస్తులతో దీనిని పోల్చవచ్చు
భూ రికార్డుల ప్రక్షాళణ : భూ కమతం ఒక సర్వే నెంబర్ కింద ఉండి, కాలక్రమేణా
విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో
వస్తున్న భూ వివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే గత
పరిస్ధితికి ఇక చెల్లు చీటి…భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రతి భూ
కమతానికి (సబ్ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు.
అత్యాధునిక సాంకేతికత ద్వారా డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్
స్టేషన్లు మరియు జీఎన్ఎస్ఎస్ రోవర్స్ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను
ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే ప్రారంభించిన మొదటి రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్. భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత
కల్పించడం మరియు 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ ఖచ్చితత్వంతో జియో–రిఫరెన్స్
కోఆర్డినేట్ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత
కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు.
అత్యాధునిక సాంకేతికతో రీసర్వే : ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ,
రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్
కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ. గ్రామ స్ధాయిలో భూ రికార్డులన్నీ
క్రోడీకరించి, మ్యాపులు ( భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక
గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయి. సింగిల్ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ
ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ దిశగా అడుగులు వేస్తోంది. భూ
లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభంగా నిర్వహించవచ్చు. భూ రక్ష కింద ప్రతి
భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు ఇక
చెక్. ళారీ వ్యవస్ధ ఇక రద్దు, లంచాలకు ఇక చోటు లేదు. భద్రత పరంగా నకిలీ
పత్రాలకు ఇక తావులేదు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు
వీలుపడవు. భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులు, అవసరమైన చోట సబ్
డివిజన్ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తారు. పారదర్శకత ఉండేలా
సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం. మండల మొబైల్ మెజిస్ట్రేట్
బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం. తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల
సర్వే మరియు యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీ చేస్త్తారు.
గ్రామాల చెంతకే సేవలు : ఇకపై గ్రామ సచివాలయాల్లో కూడా స్ధిరాస్తుల
రిజిస్ట్రేషన్లు, భూ సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా పొందవచ్చు.
భూ వివాదాలకు ఇక చరమగీతం, భూ లావాదేవీలు ఇకపై సులభతరం, వివాద రహితం, ప్రభుత్వ
హమీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం. మీ భూములు, మీ ఆస్తులు ఇక సురక్షితం.
రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులకు చెందిన 2.47
కోట్ల సర్వే నంబర్లలోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములతో రీసర్వే
ప్రాజెక్టును చేపడుతున్నారు. 13,371 గ్రామకంఠంలో (గ్రామ నివాస స్థలం) 85 లక్షల
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను మరియు 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను సర్వే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాన్ని
ప్రారంభించింది. ఈ గ్రామ స్థలాలు మరియు మున్సిపల్ భూములు కూడా మొదటిసారిగా
సర్వే చేయబడుతున్నాయి. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రూ. 1000 కోట్ల కంటే
ఎక్కువ అంచనా వ్యయంతో ప్రారంభించబడింది, డిసెంబర్, 2023 నాటికి ప్రాజెక్టును
పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
తొలిసారిగా భూ రక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే
భరిస్తోంది.దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ సర్వే,
రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ సేవలను అందించే అన్ని భూమికి సంబంధించిన
సేవలు ఏకీకృతం చేయబడతాయి, సింగిల్ డెస్క్ సిస్టమ్ (గ్రామ సచివాలయం)
పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే,
పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు రిజిస్ట్రేషన్ శాఖల
సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబడింది. సర్వే , సెటిల్మెంట్ విభాగం గ్రామ
స్థాయిలో 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించింది, వీరికి అధునాతన రీసర్వే
సాంకేతికతలపై 70కి పైగా శిక్షణలు ఇస్తున్నారు. అదనంగా, 1358 మండలæ మొబైల్
మేజిస్ట్రేట్ (మండలానికి 2) మంజూరు చేయబడ్డాయి; రైతుల భాగస్వామ్యంతో ఈ
కార్యక్రమాన్ని చేపట్టేందుకు 2797 మంది గ్రామ రెవెన్యూ అధికారులు, 7033 మంది
పంచాయతీ కార్యదర్శులు, 3664 మంది వార్డు ప్రణాళిక కార్యదర్శులను నియమించారు.
ఇప్పటివరకు 47,276 చ.కి.మీ పరిధిలోని 6,819 గ్రామాల్లో డ్రోన్
ఫ్లయింగ్ పూర్తయింది.