59వ డివిజన్ 243 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ప్రతిపక్షనేత చంద్రబాబు ఔట్ డేటెడ్ నాయకునిగా మారిపోయారని రాష్ట్ర
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విమర్శించారు. 59 వ డివిజన్ 243 వ వార్డు సచివాలయ పరిధి లూనా సెంటర్లో
మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్థానికుల నుంచి
విశిష్ట స్పందన లభించింది. ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, స్థానిక కార్పొరేటర్ ఎండి
షాహినా సుల్తానాలతో కలిసి 338 గడపలను ఎమ్మెల్యే సందర్శించారు. ఇంటింటికి
వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న సంక్షేమాన్ని బుక్
లెట్ల ద్వారా వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు.
ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారి గుమ్మం
ముందుకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు పెద్దఎత్తున
అందుతున్న సంక్షేమ కాంతులను చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తెరలతో ఆపే
ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
పరిష్కారానికై సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
సచివాలయ పరిధిలో రూ. 8.69 కోట్ల సంక్షేమం : వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక
ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చామన్న సీఎం వైఎస్ జగన్ చెప్పిన
మాటలు అక్షర సత్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 243 వ వార్డు సచివాలయ
పరిధిలో గత మూడేళ్లలో రూ. 8.69 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు
వెల్లడించారు. 497 మందికి జగనన్న ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు వివరించారు.
వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 390 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా
ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 425 మందికి రూ.
59.50 లక్షలు., ఆసరా ద్వారా 670 మందికి రూ. 66.05 లక్షలు., సున్నావడ్డీ ద్వారా
730 మందికి 12.45 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 110 మందికి
రూ. 21.44 లక్షలు., చేయూత ద్వారా 214 మందికి రూ. 40.12 లక్షలు., కాపునేస్తం
ద్వారా 31 మందికి రూ. 4.65 లక్షలు., జగనన్న తోడు ద్వారా 41 మందికి రూ. 4.10
లక్షలు., చేదోడు ద్వారా 20 మందికి రూ. 2 లక్షలు వాహనమిత్ర ద్వారా 31 మందికి
రూ. 3.10 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 15 మందికి రూ. 2.25 లక్షల ఆర్థిక
సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడు : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కళ్లెదుటే
కనిపిస్తున్నా.. చూడలేని ప్రతిపక్షాలు ఉండటం దౌర్భాగ్యమని మల్లాది విష్ణు
అన్నారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని,
ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ కంపెనీలు ఏపీ వైపు అడుగులు
వేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తుండటంతో..
ఎంతోమంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు ఆసక్తి కనబరుస్తున్నారని
చెప్పారు. దావోస్ లో ముఖ్యమంత్రితో మాట్లాడిన 30 సెకన్లలోనే ఆయన అడుగుజాడల్లో
తన కుమారుడు నడవాలని కోరుకుంటున్నట్లు టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ
చెప్పడం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనదక్షతకు అద్దం పడుతోందన్నారు. 6 నెలలు
తిరక్కుండానే తూ.గో.జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు ఆయన కుమారుడు ఆశీష్ భూమిపూజ
చేసుకోవడం, రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమన్నారు. ఏసీ
ఉత్పత్తులలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
కరోనా క్లిష్ట సమయంలోనూ ఆశించిన దానికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన
ప్రగతిని సాధించిందని మల్లాది విష్ణు వెల్లడించారు.
దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో నిరుద్యోగం రేటు తక్కువగా ఉందని,
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజా సర్వేలో వెల్లడించడం
జరిగిందన్నారు. అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత అభివృద్ధి నిరోధకుడిగా
వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తరలివస్తున్న
పరిశ్రమలను చూసి ఓర్వలేక ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్రలు
చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని
రెండోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రయత్నించి చంద్రబాబు భంగపడ్డారని
గుర్తుచేశారు. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలోనూ అదేవిధంగా
వ్యవహరిస్తున్న ఆయనకు.. మరోసారి భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో
జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సిడిఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్
రెడ్డి, నందెపు సురేష్, చింతా శ్రీను, పిల్లి లక్ష్మి, నేరెళ్ల శివ,
శాంతకుమారి, అమిత్, గల్లెపోగు రాజు, మేడా శ్రీను, మున్షీ, కొండలరావు,
తమ్మిశెట్టి రాజా, సలీమ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు,
అభిమానులు పాల్గొన్నారు.