వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు పొందేందుకు ఇరుపార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి.
కాంగ్రెస్, ఆప్‌లు తమ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీని విమర్శిస్తూనే అవి
రెండూ పరస్పరం ఆరోపణలు సంధించుకుంటున్నాయి. ‘పిట్ట పోరు పిట్టపోరు పిల్లి
తీర్చింద’ని నానుడి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లోనూ ఈ
తరహా పరిస్థితే నెలకొంది. దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పై
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇదే తమ విజయానికి దోహదపడే ప్రధానాంశమని మూడు
దశాబ్దాలుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో
తొలిసారి పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ భారీ ఆశలు
పెట్టుకున్నాయి. తాజాగా నెలకొన్న ముక్కోణపు పోటీలో రెండు విపక్షాల మధ్య
చీలిపోనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో 2017లో కన్నా ఈ దఫా తాము సునాయాసంగా
గెలవబోతున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్, ఆప్‌లు తమ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీని విమర్శిస్తూనే అవి
రెండూ పరస్పరం ఆరోపణలు సంధించుకుంటున్నాయి. ‘బీజేపీ..బి- టీమ్ ఆప్’ అని
హస్తం పార్టీ అంటుంటే ‘కమలం.. హస్తం మధ్య ఐఎల్యు(ఐ లవ్ యు) ఒప్పందం ఉందని,
గుజరాత్లో తమను తొక్కివేసేందుకే ఆ రెండు పెద్ద పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆప్
నేతలు చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ప్రశ్నించడం
ద్వారా చేసిన హడావిడి ఇప్పుడేమైందని ఆప్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్, భాజపా
మధ్య అవగాహనతోనే ఈడీ దర్యాప్తు నిలిచిపోయిందని ఆరోపించింది. అదే సమయంలో ఢిల్లీ
ఉప ముఖ్యమంత్రి, తమ సీనియర్ నేత మనీశ్ సిసోదియాపై కేంద్ర దర్యాప్తు సంస్థల
దాడులు తీవ్రంచేయడం తమ వాదనలకు బలాన్ని చేకూర్చుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో
గుజరాత్లో ఈ దఫా 150 స్థానాల్లో విజయం సాధించబోతున్నామని భాజపా నేత, కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్ భరోసా వ్యక్తం చేయడం గమనార్హం.
సామాజిక కూర్పుపై వ్యూహాలు
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడగట్టి లక్ష్యాన్ని సాధించాలని విపక్షాలు పోటీ
పడుతుంటే ఇప్పటి వరకూ తమకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి
బీజేపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పాటీదార్లు,
ఆదివాసీలు, దళితులను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని కమల దళం అమలుపరుస్తోంది.
తొలి జాబితాలో బీజేపీ 14 మంది మహిళలు, 43 మంది పాటీదార్లు, 14 మంది
బ్రాహ్మణులు, 14 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలను అభ్యర్థులుగా ప్రకటించి
సమతూకాన్ని చాటింది.
సీఎం అభ్యర్థుల్లో సత్తా ఎంత?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోన్న లోపం రాష్ట్ర స్థాయిలో
ప్రజా బలమున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు లోపించడం. బీజేపీ, కాంగ్రెస్, ఆప్
మూడింటిలోనూ ఈ వెలితి కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో
ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మూడో వారు.
తమ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గాఢ్వీని ఆప్ ఆలస్యంగా ప్రకటించింది. అతనికి
పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ మాదిరిగా విశేష ప్రజాదరణ ఏమీ లేదు.
ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో చవిచూసిన నాయకత్వ లోపాన్నే గుజరాత్‌లోనూ ఆప్
ఎదుర్కొంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో తమ సీఎం అభ్యర్థి ఎవరో వెల్లడించలేని
పరిస్థితి నెలకొంది.