ఎమ్మెల్యే చొరవతో 10 మందికి కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ
విజయవాడ : ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నట్లు
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ల కోసం గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో విన్నవించిన 10 మందికి ఎమ్మెల్యే చొరవతో ధ్రువీకరణ పత్రాలు జారీ
అయ్యాయి. సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యే చేతులమీదుగా
పత్రాలను అందజేశారు. వీరిలో ఆరుగురికి కుల ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురికి
ఆదాయ, ఒకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంలో అర్హులు ఏ ఒక్కరూ మిగిలి పోకూడదని, అందరికీ
ప్రయోజనం చేకూరాలన్న తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు
మల్లాది విష్ణు తెలిపారు. వీరంతా జగనన్న నవరత్నాల పథకాలను
సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన
వెనువెంటనే పరిష్కారం చూపడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ
సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది
విష్ణుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.ప్రసాద్,
లబ్ధిదారులు పాల్గొన్నారు.