మోహన్ రావు
విజయవాడ : నందిగామ పట్టణంలోని గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -పౌర
గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన,
వకృత్వ ,క్విజ్, చిత్ర లేఖనము పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు
సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక
పఠనంతోనే ప్రతి ఒక్కరిలో మేధాశక్తి పెంపొందుతుందని, పుస్తక పఠనం ద్వారానే
పరిపూర్ణ వ్యక్తిత్వం అలవడుతుందని తెలిపారు , ప్రస్తుత రోజుల్లో యువత సెల్
ఫోన్ ,టీవీ, సినిమాలు , ఇంటర్నెట్ లకు బానిసలై పెడదోవ పడుతున్నారని , మంచి
పనులకు మాత్రమే వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు
పఠన శక్తి పెంపొందించుకోవాలని చెప్పారు , గ్రంథాలయ వ్యవస్థను ఆధునికరించే
క్రమంలో భాగంగా డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చారని , గ్రంథాలయ వ్యవస్థ
పరిరక్షణకు రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
గ్రంథాలయాల వలన విజ్ఞానంతో పాటు ప్రముఖుల జీవిత చరిత్రలను తెలుసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు,
గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.