బొప్పరాజు వెంకటేశ్వర్లు వైవీ రావు
విజయవాడ : నవంబర్ 27 న ఆదివారం ఉదయం పది గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి
కళాక్షేత్రం లో జరుగబోయే ఏపీ జేయేసీ అమరావతి ఆధ్వర్యంలోని ఆంధ్ర ప్రదేశ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంస్ధ రాష్ట్ర ప్రధమ మహాజన సభను జయప్రదం
చేయాలని, తద్వారా గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి
సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా మేము కృషి
చేస్తామనీ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై. వీ రావు
తెలిపారు. అలాగే 27న జరుగబోయే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల
రాష్ట్ర ప్రధమ మహాజనసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల
రామకృష్ణారెడ్డిముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కావున ప్రతి ఒక్క
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తరలివచ్చి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల
ఐక్యతను చాటి మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని బొప్పరాజు కోరారు.
అతి తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ
తరపున రాష్ట్రంలోని 26 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసుకుని, ఈనెల 27వ తేదీన
తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగబోయే రాష్ట్ర మహాజనసభలో నూతన రాష్ట్ర
కార్యవర్గాన్ని గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులందరి సమక్షంలో ఎన్నుకోవడం
జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ
ఏకతాటిపైకి తెచ్చే విధంగా అడుగులు వేయబోతున్నక్ ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు
సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థకి అనుబంధంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి
సహకారం అందించాలని ఈ సందర్భంగా బొప్పరాజు కోరారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ
జనరల్ వైవి రావు, వీ. అర్లయ్య, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు ఇరువురు
మాట్లాడుతూ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల ఐక్యతను చాటే సమయం ఆసన్నమైందని,
మీయొక్క ఐక్యతను 27వ తేదీ జరుగబోయే రాష్ట్ర ప్రథమ మహాజన సభను విజయవంతం చేయడం
ద్వారా తెలియజేయాలని, ఆనాటి నుండి మీ సమస్యలన్నిటికీ చరమగీతం పాడే దిశగా
అడుగులు వేయాలని తెలియజేశారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు జగదీశ్, ఎన్ టీ ఆర్
జిల్లా అధ్యక్షులు దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.