అమరావతి : ఈ నెల 19 నుండి 25 వరకు వారం రోజుల పాటు మతసామరస్య ప్రచార
వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ
(పొలిటికల్) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల మధ్య మత సామరస్యం, జాతీయ సమైక్యత
విలువలను పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో కేంద్ర
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో స్వయంప్రతిపత్తి గల మతసామరస్య జాతీయ
సంస్థను 1992లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఈ సంస్థ ఆద్వర్యంలో
ప్రతి ఏడాది నవంబరు 19 నుండి 25 వరకూ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా
మతసామరస్య ప్రచార వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు.ఈ
వారోత్సవాల చివరి రోజైన నవంబరు 25 న ప్లాగ్ డే ను దేశవ్యాప్తంగా జరుపుకోవడం
జరుగుతుందని పేర్కొన్నారు.అదే విధంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ
వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని
జిల్లాల్లోను శాంతి, సామరస్యం మరియు జాతీయ సమైఖ్యత విలువలను ప్రజల్లో
పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, డిబేట్లు,
పెయింటింగ్ పోటీలను నిర్వహించాలని తెలిపారు. మతసామరస్య జాతీయ సంస్థ పలు
పథకాలు, ప్రాజక్టులను కొనసాగించేందుకు మరియు మరింత విస్తృత స్థాయిలో
నిర్వహించేందుకు అవసరమైన నిధుల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఈ వారోత్సవాల్లో
చేపట్టాలన్నారు. ఇందుకు సంబందించిన ఆదేశాలను ఇప్పటికే అన్ని జిల్లాల
కలెక్టర్లకు జారీచేయడం జరిగిందని, అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బందితో
పాటు ప్రజలు కూడా ఈ వారోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని
రాష్ట్ర ప్రిన్సిఫల్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు.