చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పలు పథకాలకు ఎప్పటికప్పుడు
డబ్బులు అందిస్తున్నారు. పైగా, కొత్త పథకాలకు కూడా రూపకల్పన చేస్తున్నారు. పాత
పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. ఇందులో
భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారికి ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్
పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జగనన్నవిద్యాదీవెన పథకం కింద దాదాపు
10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను సీఎం వైఎస్ జగన్ మదనపల్లెకు
వెళ్లి.. అక్కడ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా
ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్నవసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం సాయం
అందించింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం కింద
లబ్ధిచేకూరనుంది.
జగనన్న విద్యా దీవెన కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్
తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల
మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే
విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా
ప్రతి ఏటా రెండు వాయిదాల్లో..ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్
విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు
నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ నెల 25న ‘జగనన్న విద్యా దీవెన’ నాలుగో విడత సాయం అందించనున్నారు.
మదనపల్లెకు ఈనెల 25వ తేదీ సీఎం జగన్ చేరుకూనున్నారు. నాలుగో విడత విద్యా దీవెన
కార్యక్రమంలో పాల్గొని సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే
నవాజ్ భాషా, జెసి తమీమ్ అన్సారియా మదనపల్లిలో పర్యటించి సభ స్థలాలను
పరిశీలించారు. పట్టణంలోని కదిరి రోడ్డు పక్కన టిప్పు సుల్తాన్ మైదానం, బీటీ
ప్రభుత్వ కళాశాల మైదానం, చిప్పిలి డైయిరీ వెనుక గల ఖాళీ స్థలాలను ఇప్పటికే
అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా దీవెన పంపిణీలో భాగంగా వచ్చే బుధవారం
సీఎం మదనపల్లెకు వస్తున్నారన్నారు. రెండు మైదానాలను ఎంపిక చేసి ఒకదానిలో
హెలిప్యాడ్, రెండో దానిలో సభ నిర్వహించనున్నమన్నారు.
తక్కువ సమయం ఉన్నందున పనులు వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు.