31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ప్రజలందరూ సంతోషంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో
సుపరిపాలన అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం
పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వీధులలో విస్తృతంగా
పర్యటించి 294 గడపలను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జనరంజక, అవినీతిరహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఏపీలో
అమలవుతున్న బృహత్తర కార్యక్రమాలు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు కావడం
లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు కూడా ఎప్పుడూ ఇంతటి గొప్ప
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్రలేదన్నారు. ఈ సందర్భంగా స్థానికుల
నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. రేషన్ వాహనం ప్రతి ఇంటికీ కచ్చితంగా వెళ్లాలని
సిబ్బందికి సూచించారు. శ్రీనగర్ కాలనీ 3వ లైన్లో దెబ్బతిన్న రహదారిని
పున:నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు
సూచించారు. అనంతరం ఊడల ఆదిలక్ష్మి, గ్రంథి కాళేశ్వరరావు అను వృద్ధులకు మంజూరైన
కుల, ఆదాయ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. వీరిరువురికి కొత్త
పింఛన్లు అప్లై చేయవలసిందిగా సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం మీడియాతో
మాట్లాడారు.