విజయవాడ : జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలను
చేపడుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సమావేశాలు ఈ నెల 22వ తేదీ
నుంచి మొదలవుతాయి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల
మనోహర్ సమీక్షలు నిర్వహిస్తారు. విజయనగరంలో ఈ సమావేశాలు ఉంటాయి. 22వ తేదీ
నుంచి వారం రోజులపాటు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఈ సమావేశాలు చేపట్టేందుకు
షెడ్యూల్ సిద్ధం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక
సభ్యత్వ నమోదు చేపట్టిన వాలంటీర్లు, పార్టీ విభాగాల సభ్యులు పాల్గొంటారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం, జిల్లా
స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు,
కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై చర్చిస్తారు.