విజయవాడ : సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కరోనా
వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడింది.
ఆ శూన్యత నుండి కవుల్ని రచయితల్ని ఒక గొప్ప సాహిత్య కళా వాతావరణంలోకి
ఆహ్వానించేలా, కొత్త కవులు, కళాకారులను
ప్రోత్సహించేలా, పెద్దవారికి గౌరవించేలా ఆహ్లాదకరమైన సాంస్కృతిక వాతావరణ
పరిమళాల్ని నింపేలా ‘మల్లెతీగ’ సాహిత్య సేవాసంస్థ
‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ నిర్వహించబోతుంది. విజయవాడలో నవంబరు 19, 20
తేదీలు శని, ఆదివారాల్లో రెండురోజులపాటు తుమ్మల పల్లి కళా క్షేత్రంలో జరిగే ఈ
కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు కవులు,
రచయితలు, ఇతర రాష్ట్రాల్లో నివసించే
తెలుగు కళాకారులు, రచయితలు పాల్గొంటారు. శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుండి
సాయంత్రం 7 గంటల వరకు
ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం ప్రతినిధులందరికీ భోజన ఏర్పాటు ఉంటుంది.
2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక
ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముగుస్తాయి.
రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ‘సాహిత్యంలో వస్తున్న మార్పులపై చర్చలు,
కొత్తతరం రచయితల కోసం లబ్ధప్రతిష్టులైన
రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, కథ, కవిత, గజల్ ప్రక్రియలపై చర్చా
కార్యక్రమాలు, మధుర గీతాలాపనలు, ఆయా
రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త
పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు
వుంటాయని
కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షుడు
కలిమిశ్రీ, ఇస్కా రాజేష్
బాబు, చొప్పా రాఘవేంద్రశేఖర్,
యేమినేని వెంకటరమణ, వల్లూరు ప్రసాద్ కుమార్ వెల్లడించారు. గురువారం సాయంత్రం
విజయవాడ లోని ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 19న ప్రారంభోత్సవ సభ కు ఆంధ్ర ప్రదేశ్ పభుత్వ
సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్. కే రోజా, విజయవాడ
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గజల్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు వెల్లడించారు.
20వ తేదీ ముగింపు సభకు ప్రసిద్ధ ప్రజా వాగ్గేయకారులు , ఎమ్మెల్సీ వెంకన్న,
ఆంధ్ర ప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ
పార్వతి, సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్ ఆర్. మహబూబ్ భాషా, ఆంధ్ర
ప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. వి విజయ్ బాబు తదితరులు
పాల్గొంటారని వివరించారు