అందిస్తున్న ఖిద్మాత్ బ్యాంకు సేవలు ఎన్నదగినవని ఆంధ్రప్రదేశ్ స్టేట్
మైనారిటిస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్* పెర్కొన్నారు.
మంగళగిరిలోని తెనాలి రొడ్డులో ఉన్న ఖిద్మత్ బ్యాంకు శాఖను అయన బుదవారం
సందర్శించారు. ఖిద్మత్ సేవలకు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. నిర్వహకులు
రుణాలకోసం దరఖాస్తు చేసుకొని అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటిస్
కమిషన్ చైర్మన్ డాక్టర్ కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ చేతుల మీదుగా నగదు ను
అందించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటిస్ కమిషన్ చైర్మన్
డాక్టర్ కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ మాట్లడుతూ ఋణాలకోసం ఆనేకమంది యాపులను
ఆశ్రయించి మోసపోవడం వేదింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుందన్నారు .
రాష్ట్ర ప్రభుత్వం సిఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంతో రుణయాపూల నిర్వాహకులపై
పై ఉక్కుపాదం వేయడం జరిగిందన్నారు .
ఈ నేపథ్యంలోనే ఖిద్మత్ స్వచ్చంద సేవాసంస్ఠ ఋణ అవసరార్థులకు వడ్డిలేని డబ్బు
సాయాన్ని అందించడం అభినందనీయమన్నారు. రుణగ్రహీతలు సరళీకృతమైన విధివిధానాలతో
రుణాలను ఇస్తూ వుండటం మరొ మంచివిషయమన్నారు . ఖిద్మత్ సేవలను రాష్ట్రంలోని
అన్ని జిల్లాలలో విస్తరించాలని నిర్వాహకులను కోరారు . ఈ కార్యక్రమంలో ఖిద్మత్
డిస్ట్రిక్ బోర్డ్ డైరెక్టరులు ఏస్ ఏ సాలార్ , అసదుల్లా ఉమరి , మంగళగిరి
బ్రాంచ్ మేనేజింగ్ కమిటి ప్రెశిడెంట్ షెక్ సందాని , మంగళగిరి బ్రాంచ్ బీఎంసీ
మెంబర్లు షెక్ నిజాముద్దీన్ , విజయ కుమార్ , బ్రాంచ్ మేనేజరు షెక్ రఫి ,
బ్రాంచ్ ఎల్డర్ కౌన్సిల్ మెంబర్లు అబ్దుల్ ఖదర్ బాబావలి, షేక్ అబ్దుల్ అజీమ్,
అన్వర్ అలీ పాల్గోన్నారు.