పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్
విజయవాడ : నిజాన్ని నిర్భయంగా రాస్తే బెదిరింపులు, దాడులు తప్పవని తెలిసినా
ప్రజాస్వామ్య పరిరక్షణకు , సమాజాభ్యున్నతికి మీరు చేస్తున్న సేవలు
ప్రశంశనీయమని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్య లక్ష్మి అన్నారు. జాతీయ పత్రికా
దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్
నగర, రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం షేక్ రాజా సాహెబ్ ప్రభుత్వ
ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణులకు, ఆసుపత్రి సిబ్బందికి మేయర్ రాయన భాగ్య
లక్ష్మి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా భాగ్య లక్ష్మి మాట్లాడుతూ పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని
గుర్తు చేస్తూ ఏర్పడిన జాతీయ పత్రికా దినోత్సవ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో
ఆలోచించాల్సిన రోజు ఇదని, దేశ రక్షణకు సైనికులు పాటు పడినట్లే ప్రజాస్వామ్య
పరిరక్షణకు పాటుపడే అక్షర సైనికులు మీరు అని ప్రశంసించారు. ఈసందర్భంగా
జర్నలిస్టులందరికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనరల్
మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, డెంటల్, అనస్థీషియా, ఫార్మసీ
ల్యాబ్, టీబీ విభాగం, స్టాఫ్ నర్సులు, బాలింతలు, గర్భిణులకు పండ్లు పంపిణీ
చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర
కార్యదర్శి యేమినేని వెంకట రమణ, ఉపాధ్యక్షులు ఇస్కా రాజేష్ బాబు, నగర
అధ్యక్షుడు తాళ్లూరి అనిల్ కుమార్, అబ్దుల్ కలాం సేవా సంస్థ అధ్యక్షుడు వేముల
వెంకట్రావు, నగర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అంతిమ తీర్పు ఎడిటర్ వల్లూరు
ప్రసాద్ కుమార్, హెడ్ నర్సు రాజ సులోచన పాల్గొన్నారు.